అక్షరటుడే వెబ్‌డెస్క్: Indiramma Housing Scheme | గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ (క్యూర్ – CUR) పరిధిలోనూ అదే దిశగా చారిత్రాత్మక అడుగు వేస్తోంది. క్యూర్ పరిధిలో దశలవారీగా లక్ష ఎల్‌ఐజీ (LIG) ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనున్నట్లు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. సచివాలయంలో హౌసింగ్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.ఈ నెల 20వ తేదీన క్యూర్ పరిధిలో ఎల్‌ఐజీ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంత్రి మహ్మద్ అజారుద్దీన్‌తో కలిసి, ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు, అర్హతలు, దరఖాస్తుల ప్రక్రియ , టెండర్ల వివరాలను ఆ రోజు వెల్లడించనున్నట్లు మంత్రి తెలిపారు.
Indiramma Housing Scheme | పేదల అవసరాలకు ప్రాధాన్యత..
గత ప్రభుత్వం నగరానికి 30-40 కిలోమీటర్ల దూరంలో ఇళ్లు నిర్మించడం వల్ల పేదలు ఉపాధి కోల్పోయారని, అందుకే అక్కడ నివసించేందుకు ఆసక్తి చూపలేదని మంత్రి విమర్శించారు. తాము మాత్రం పేదల జీవన వాస్తవాలను అర్థం చేసుకున్నామని, వారు నివసిస్తున్న ప్రాంతాలకు దగ్గరగా, రవాణా, విద్య, వైద్య సౌకర్యాలు ఉన్న చోట నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఇండ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. విలువైన ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లను కట్టి, వారికి యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా ఆర్థిక భద్రతను కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
Indiramma Housing Scheme | పైలట్ ప్రాజెక్టుగా నిర్మాణాలు..
2026-27 ఆర్థిక సంవత్సరంలో లక్ష ఇండ్ల నిర్మాణమే లక్ష్యమని, తొలి దశలో పైలట్ ప్రాజెక్టుగా ప్రతి నియోజకవర్గంలో కనీసం 500 నుంచి 1000 ఇండ్లను నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి పరిధిలో హౌసింగ్ శాఖ స్థలాలను గుర్తించి స్వాధీనం చేసుకుందని మంత్రి తెలిపారు. ప్రాజెక్టు డిజైన్లు, ప్లాట్ విస్తీర్ణం , అంతస్తుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి రెండు మూడు రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి పొంగులేటి వివరించారు.
🔹ఈ నెల 20న క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇండ్లకు శ్రీకారం
🔹దశలవారీగా లక్ష ఇండ్ల నిర్మాణం
🔹పైలట్ ప్రాజెక్టుగా నియోజకవర్గానికి వెయ్యి ఇండ్ల వరకు నిర్మాణం
🔹గ్రామీణ ప్రాంతాల్లో మొదలైన ఇందిరమ్మ ఇళ్ల విప్లవం.. ఇప్పుడు పట్టణ పేదల జీవితాల్లోకిగ్రామీణ ప్రాంతాలల్లో ఇందిరమ్మ… pic.twitter.com/OLhwUZaP13
— Office of Ponguleti (@PonguletiOffice) July 14, 2026
ఇది కూడా చదవండి: Indian Stock Market | భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు