బిజినెస్​April 29 Market Analysis | మిక్స్​డ్​గా గ్లోబల్ క్యూస్.. ప్లాట్​గా ప్రారంభం కానున్న దేశీయ...

April 29 Market Analysis | మిక్స్​డ్​గా గ్లోబల్ క్యూస్.. ప్లాట్​గా ప్రారంభం కానున్న దేశీయ మార్కెట్లు!

ప్రధాన గ్లోబల్ మార్కెట్లు మిక్స్ డ్ గా ఉన్నాయి. మన మార్కెట్లు ప్లాట్ గా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్​: April 29 Market Analysis | ఇరాన్ పై సుదీర్ఘ దిగ్బంధనానికి సిద్ధంగా ఉండాలని అమెరికా అధ్యక్షుడు(America President) ట్రంప్ తన సహాయకులను ఆదేశించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో ఇప్పట్లో అనిశ్చితి తగ్గే అవకాశాలు కనిపించకపోవడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

దీనికితోడు ఆర్టిఫిషియల్ ఇంటెటిజెన్స్ పై కొత్త భయాలతో గత సెషన్‌లో వాల్ స్ట్రీట్(Wallstreet) నష్టాలతో ముగిసింది. యూరోపియన్ మార్కెట్లు సైతం నష్టపోయాయి. కాగా బుధవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్ డ్‌గా సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ స్వల్ప లాభాలతో ఉండడంతో మన మార్కెట్లు ప్లాట్ గా ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

April 29 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

టెక్ స్టాక్స్‌లో ప్రాఫిట్ బుకింగ్‌తో వాల్ స్ట్రీట్ అమ్మకాల ఒత్తిడికి గురయ్యింది. గత సెషన్‌లో నాస్‌డాక్ 0.90 శాతం, ఎస్ అండ్ పీ 0.49 శాతం తగ్గాయి. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.17 శాతం లాభంతో ఉంది.

April 29 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

యూకేకు చెందిన ఎఫ్ టీఎస్ ఈ 0.11 శాతం పెరగ్గా.. ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.47 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.27 శాతం నష్టపోయాయి.

ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో సాగుతున్నాయి. ఉదయం 7.45 గంటల ప్రాంతంలో హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.26 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.07 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.02 శాతం లాభంతో కొనసాగుతుండగా.. తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.85 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.50 శాతం నష్టంతో ఉన్నాయి. జపాన్‌లో పబ్లిక్ హాలిడే కారణంగా అక్కడి స్టాక్ మార్కెట్‌కు సెలవు. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) 0.02 శాతం లాభంతో సాగుతుండడంతో మన మార్కెట్లు ప్లాట్ గా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐలు వరుసగా ఏడో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 2,103 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మారు.
  • డీఐఐలు వరుసగా నాలుగో సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 1,712 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1 నుంచి 0.98 కు తగ్గింది.
  • విక్స్ 1.8 శాతం తగ్గి 18.05 వద్ద ఉంది.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 111.90 డాలర్లకు చేరింది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 98.65 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.35 వద్ద ఉన్నాయి.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 35 పైసలు బలహీనపడి 94.55 వద్ద ఉంది.
  • యూఎస్ ఫెడ్ సమావేశాల తీర్మానాలు ఈ రోజు వెలువడనున్నాయి. ఫెడ్ చైర్మన్ పొవెల్ కు ఇది చివరి సమావేశం కావడంతో ఆయన ఏ విధమైన కామెంట్స్ చేస్తారోనని ఇన్వెస్టర్లు ఆసక్తిగా గమనిస్తున్నారు.

Mumbai Kalma Attack Case | ప్రాణాల కోసం ఆరాటం… తెల్లవారుజామున భయానక క్షణాలు.. ముంబయిలో పహల్గావ్​ తరహాలో దాడికి ప్రణాళిక!

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో...

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...