Oracle Layoffs | ఈ రోజే మీ చివరి రోజు.. ఉద్యోగులకు ఒరాకిల్ షాక్​

ప్రముఖ టెక్​ దిగ్గజం ఒరాకిల్ తన ఉద్యోగులకు షాక్​ ఇచ్చింది. ఈ రోజే మీ చివరి రోజు అని పలువురికి మెయిల్ పంపింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oracle Layoffs | ప్రముఖ టెక్​ దిగ్గజం ఒరాకిల్ సంస్థ తన ఉద్యోగులకు షాక్​ ఇచ్చింది. ఈ రోజే మీ చివరి పని దినం అని తెల్లవారుజామున 6 గంటలకు మెయిల్ పంపింది.

ఏఐ (Artificial Intelligence) రాకతో అనేక టెక్​ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఒరాకిల్ సైతం కాస్ట్​ కట్టింగ్​ చర్యలు చేపట్టింది. పలువురు ఉద్యోగులను తొలగించి, ఏఐ ద్వారా వారి సేవలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉదయం పలువురికి మెయిల్స్​ పంపింది. “మీ పదవికి సంబంధించి మేము ఒక కఠినమైన వార్తను తెలియజేస్తున్నాం… ఈరోజే మీ చివరి పనిదినం.” అని అందులో ఉంది. దీంతో వారు షాక్​ అయ్యారు. అయితే ఎంతమందిని తొలగిస్తున్నారనే విషయమై సంస్థ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Oracle Layoffs | ఏఐపై భారగా ఖర్చు..

విస్తృత సంస్థాగత మార్పులో భాగంగా తొలగిస్తున్నట్లు సంస్థ మెయిల్​లో పేర్కొంది. ఒరాకిల్ కంప్యూటర్లు, ఇమెయిల్, వాయిస్‌ మెయిల్, ఫైళ్లకు వారి యాక్సెస్ త్వరలో నిలిపివేయబడుతుందని స్పష్టం చేసింది. ఉద్యోగ విరమణ పరిహారం, ఇతర తొలగింపు సంబంధిత పత్రాల గురించి సమాచారం పొందడానికి ఒక వ్యక్తిగత ఇమెయిల్ చిరునామాను అందించమని కంపెనీ కోరింది. ఏఐ రంగంలో వస్తున్న విప్లవానికి అవసరమైన డేటా సెంటర్లు, కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల కోసం ఒరాకిల్ భారీగా ఖర్చు చేస్తోంది. 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఒరాకిల్ 28.5 బిలియన్ల డాలర్లు వెచ్చించింది. మరోవైపు భారీగా సిబ్బందిని తొలగిస్తుంది.

Oracle Layoffs | 21 వేల మంది తొలగింపు

ఒరాకిల్ 2026 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు సుమారు 21 వేల మంది ఉద్యోగులను తొలగించింది. తాజాగా మరికొంత మందిని ఇళ్లకు పంపించనుంది. ఈ ఏడాదిలో కంపెనీ ఉద్యోగ విరమణ చెల్లింపులు, పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించిన ఇతర ఖర్చుల కోసం సుమారు 1.84 బిలియన్​ డాలర్లు వెచ్చించనున్నట్లు సంస్థ తెలిపింది.

ఇది కూడా చదవండి..: KA Paul Peace | నిత్యావసరాల ధరలపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *