Junior Trump Wedding | ట్రంప్ కుమారుడి వెడ్డింగ్ పార్టీకి రష్యా కుబేరుడి నిధులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్, ఆయన భార్య బెట్టినా ఆండర్సన్ వివాహ వేడుకకు సంబంధించిన ఆసక్తికర నిజాలు వెలుగులోకి వచ్చాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Junior Trump Wedding | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్, ఆయన భార్య బెట్టినా ఆండర్సన్ వివాహ వేడుకకు సంబంధించిన ఆసక్తికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. మే నెలలో జరిగిన తమ పెళ్లి ఖర్చుల కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ( Vladimir Putin )అత్యంత సన్నిహితుడైన ఒక వ్యాపారవేత్త నిధులు సమకూర్చినట్లు వస్తున్న వార్తలను జూనియర్‌ ట్రంప్‌ దంపతులు స్వయంగా ధ్రువీకరించారు. అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ అధిపతి ఉమర్ క్రెమ్లెవ్ తమ వివాహానికి సంబంధించిన లక్షల డాలర్ల ఖర్చులను భరించినట్లు వారు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు.

Junior Trump Wedding | అత్యంత వైభవంగా ..

“మా అత్యంత సన్నిహితుడైన ఉమర్ క్రెమ్లెవ్ బహమాస్‌లో మా వివాహ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆయన అందించిన ఈ అసాధారణ కానుకకు మేము ఎంతో కృతజ్ఞులమై ఉన్నాము” అని జూనియర్‌ ట్రంప్‌ దంపతులు పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో నెలకొన్న భద్రతా పరిస్థితుల కారణంగా ఈ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరు కాలేకపోయారు.

Junior Trump Wedding | పెరిగిన చర్చ..

ట్రంప్ కుమారుడి పెళ్లి వేడుకల కోసం రష్యన్ కుబేరుడు క్రెమ్లెవ్ భారీగా నిధులు వెచ్చించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ వార్తలు పెద్ద ఎత్తున చర్చనీయాంశం కావడంతో జూనియర్‌ ట్రంప్‌ దంపతులు స్పందించి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ చేతుల మీదుగా క్రెమ్లెవ్ గతంలో ‘ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్’ అవార్డును అందుకున్నట్లు, అలాగే గతంలో జూనియర్ ట్రంప్ ఆయనతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

ఇది కూడా చదవండి:  KTR Allegations | కాంగ్రెస్​ కార్యకర్తల్లా పోలీసుల తీరు : కేటీఆర్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *