అంతర్జాతీయంTrump Iran Strategy | ఇరాన్‌పై ట్రంప్ వ్యూహం.. ఆర్థిక దిగ్బంధమే లక్ష్యం!

Trump Iran Strategy | ఇరాన్‌పై ట్రంప్ వ్యూహం.. ఆర్థిక దిగ్బంధమే లక్ష్యం!

హర్మూజ్ జలసంధి వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Trump Iran Strategy | హర్మూజ్ జలసంధి వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. తాజా పరిణామాల ప్రకారం, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్‌పై ప్రత్యక్ష యుద్ధం కంటే ‘దీర్ఘకాలిక ఆర్థిక దిగ్బంధనం’ వైపే మొగ్గు చూపుతున్నారు.

Trump Iran Strategy | ట్రంప్ వ్యూహం ఏంటి?

ఇరాన్‌ను లొంగదీసుకోవడానికి సైనిక దాడుల కంటే ఆర్థికంగా దెబ్బతీయడమే సరైన మార్గమని ట్రంప్ భావిస్తున్నారు. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)ని దిగ్బంధించడం ద్వారా ఇరాన్ ప్రధాన ఆదాయ వనరైన చమురు ఎగుమతులను పూర్తిగా అడ్డుకోవాలని అమెరికా ప్లాన్ చేస్తోంది. సైనిక చర్య వల్ల జరిగే నష్టం కంటే, ఆర్థిక సంక్షోభం వల్ల ఇరాన్ ప్రభుత్వం (Iran Government) ఎక్కువ ఒత్తిడికి లోనవుతుందని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది.

Trump Iran Strategy | యుద్ధ నౌకలను సముద్రంలోనే భస్మం చేస్తాం:

అమెరికా చర్యలపై ఇరాన్ సైన్యం (IRGC) నిప్పులు చెరుగుతోంది. అమెరికా గనుక కయ్యానికి వస్తే పశ్చిమాసియాలోని తమ మిత్ర పక్షాలతో కలిసి అమెరికా యుద్ధ నౌకలను సముద్రంలోనే భస్మం చేస్తామని హెచ్చరించింది.

నియంత్రణ: “హర్మూజ్ జలసంధిపై పట్టు మాదే.. శత్రువుల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు” అని ఇరాన్ ఆర్మీ స్పష్టం చేసింది. సీజ్‌ఫైర్ చర్చలు జరుగుతున్నా, క్షేత్రస్థాయిలో ఇంకా యుద్ధ వాతావరణమే ఉందని వారు పేర్కొన్నారు.

Trump Iran Strategy | ట్రూత్ సోషల్’ వేదికగా:

ఇదే అంశంపై జర్మనీ ఛాన్సలర్ ఫెడ్రిక్ మెర్జ్ చేసిన విమర్శలపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ అణు సామర్థ్యంపై మెర్జ్ తప్పుడు అంచనాలతో ఉన్నారని, ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉంటే అది ప్రపంచ వినాశనానికి దారితీస్తుందని ట్రంప్ హెచ్చరించారు. తన విధానాలను మెర్జ్ తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ మండిపడ్డారు.

ఇది కూడా చదవండి..: UAE OPEC Exit : ఓపెక్‌కు షాక్.. 50 ఏళ్ల తర్వాత యూఏఈ వైదొలగింపు!

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Madhya Pradesh Accident | మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం.. 16 మంది మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Madhya Pradesh Accident | మధ్యప్రదేశ్ (Madhya...

SR SSC Results ​| ఎస్సెస్సీ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యార్థుల ప్రభంజనం

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: ​SR SSC Results ​| ఎస్సెస్సీ ఫలితాల్లో...

Sunrisers Batting | వాంఖడేలో పరుగుల వరద.. స‌న్‌రైజ‌ర్స్ తుపాను చూసి క‌న్నీళ్లు పెట్టుకున్న నీతా అంబాని

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sunrisers Batting | ముంబైలోనివాంఖడే స్టేడియం వేదికగా జరిగిన...

Amaravati Development | అమరావతి అభివృద్ధికి కీలక నిర్ణయాలు.. ఈరోజు మంత్రివర్గ సమావేశంలో భారీ ప్రాజెక్టులకు ఆమోదం?

అక్షరటుడే, వెబ్​డెస్క్: Amaravati Development | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి...