Ganesh Mandap DJ Ban | డీజేలకు ఎట్టి పరిస్థితిలో అనుమతి లేదు.. పోలీసు అధికారుల హెచ్చరిక!

నిబంధనలు ఉల్లంఘించి డీజేలు వాడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Naresh Chandan

అక్షరటుడే, నందిపేట్/ డొంకేశ్వర్: Ganesh Mandap DJ Ban | నందిపేట్, డొంకేశ్వర్ మండలాల గణేష్ మండప నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆర్మూర్ ఏసీపీ జె. వెంకటేశ్వర రెడ్డి సమన్వయ సమావేశం నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన వేడుకల సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, పాటించాల్సిన నిబంధనలపై ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.

Ganesh Mandap DJ Ban | మండపాల వద్ద అందుబాటులో ఉండాలి

ఉత్సవాల్లో డీజే (DJ) సౌండ్ సిస్టమ్‌ల వినియోగానికి ఎట్టి పరిస్థితిలోనూ అనుమతి లేదని ఏసీపీ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి డీజేలు వాడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండపాల వద్ద రాత్రి సమయంలో తప్పనిసరిగా నిర్వాహకులు అందుబాటులో ఉండాలని సూచించారు.

Bigala Ganesh Gupta 22A | నేనూ 22A బాధితుడినే!.. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా సంచలన వ్యాఖ్యలు

akshara today .jpgDj

ప్రమాదాల నివారణకు ప్రతి మండపం వద్ద ఇసుక బకెట్లు, నీటితో నింపిన డ్రమ్ములను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి, ఆయా మండలాల ఎంపీడీవోలు, విద్యుత్ శాఖ ఏడీ, ఏఈ, రెవెన్యూ ఆర్‌ఐలు, గ్రామ పరిధిలోని సర్పంచులు, ఉపసర్పంచులు, గణేష్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *