అక్షరటుడే వెబ్‌డెస్క్: Meenakshi Natarajan Case | తెలంగాణ ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జ్, కాంగ్రెస్ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ చిక్కుల్లో పడ్డారు. ఉన్నత చదువుల నిమిత్తం లండన్ వెళ్లాలని భావిస్తున్న ఆమెకు కోర్టులో ఊహించని షాక్ తగిలింది. ఆమె విదేశాలకు వెళ్లకుండా అడ్డుకోవాలని కోరుతూ బాధితురాలు శ్రీలత నాంపల్లి కోర్టును ( Nampally )ఆశ్రయించారు. మీనాక్షిపై ఇప్పటికే రెండు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నందున, ఆమె దేశం విడిచి వెళ్లకుండా వెంటనే పాస్‌పోర్ట్‌ను జప్తు చేయాలని కోర్టును అభ్యర్థించారు.
Meenakshi Natarajan Case | నామినేషన్ తిరస్కరణ..
గత జూన్ నెలలో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ బరిలో నిలిచిన మీనాక్షి నటరాజన్‌కు ఎన్నికల సంఘం (ఈసీ) గట్టి షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఆమె దాఖలు చేసిన నామినేషన్‌ను ఈసీ తిరస్కరించింది. అఫిడవిట్లో ఆస్తుల వివరాలతో పాటు తనపై ఉన్న కేసుల సమాచారాన్ని సరిగ్గా వెల్లడించలేదని బీజేపీ నేతలు అప్పట్లో ఫిర్యాదు చేశారు.
నాటి నామినేషన్ తిరస్కరణకు కారణమైన కంభం శివకుమార్ రెడ్డి కేసులోని బాధితురాలే ఇప్పుడు మీనాక్షి విదేశీ పర్యటనను అడ్డుకోవడానికి కోర్టును ఆశ్రయించడం గమనార్హం. ఇప్పటికే ఎంపీ పదవి దక్కకుండా పోవడంతో పాటు, ఇప్పుడు లండన్ పర్యటన వ్యవహారం ఆమెకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఇది కూడా చదవండి: Praja Palana Day | కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం