Disability Empowerment | దివ్యాంగులకు సానుభూతి కాదు.. అవకాశాలు కావాలి: ఎంపీ అర్వింద్​

దివ్యాంగులకు సానుభూతి కాదు.. అవకాశాలు కావాలని ఎంపీ అర్వింద్​ పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Disability Empowerment | దివ్యాంగులకు సానుభూతి కాదు.. అవకాశాలు కావాలని ఎంపీ అర్వింద్( MP Arvind)​ పేర్కొన్నారు. నగరంలో (Nizamabad) సెప్టెంబర్ 17ను సేవాదినంగా భావిస్తూ, పీఎం మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దివ్యాంగులు, వయోవృద్ధులకు సహాయక పరికరాలు అందించారు.

Disability Empowerment | దివ్యాంగుల సంక్షేమానికి కృషి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం, సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. దివ్యాంగులకు సానుభూతి కాదు.. అవకాశాలు, గౌరవం, సాధికారత అవసరమని ఎంపీ స్పష్టం చేశారు. సహాయక పరికరాలు వారి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవానికి సాధనాలని పేర్కొన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రూ.2.10 కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వ నిధులతో సుమారు 1,000 మంది దివ్యాంగులు, వయోవృద్ధులకు వివిధ రకాల సహాయక పరికరాలు అందించడం ద్వారా ప్రయోజనం చేకూరనుందని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో 19 రకాల సహాయక పరికరాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్​కు ఎంపీ అర్వింద్ కృతజ్ఞతలు తెలిపారు.

Disability Empowerment | వెయ్యి మంది దివ్యాంగులకు..

నిజామాబాద్ నార్త్, ఆర్మూర్, బోధన్, జగిత్యాల కోరుట్ల ప్రాంతాల్లో ఇప్పటికే సుమారు 1000 మంది దివ్యాంగులను గుర్తించామని, మిగిలిన అర్హుల గుర్తింపు ప్రక్రియను కూడా కొనసాగిస్తామని తెలిపారు. మారుమూల గ్రామాల్లో ఉన్న అర్హులెవరూ ప్రభుత్వ సహాయానికి దూరం కాకుండా చూడాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ , జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి , స్రవంతి రెడ్డి, ప్రమోద్, కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, వైష్ణవి సుధా, జ్యోతి మురళి, ప్రసూన శ్రీనివాస్ రెడ్డి, మహిళా శిశు వికలాంగుల శాఖ జిల్లా అధికారి సౌందర్య, అలింకో ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ఘాట్ రోడ్డులో ప్రమాదం మహిళ మృతి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *