అక్షరటుడే వెబ్‌డెస్క్: Danam Nagender Disqualification | ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన అనర్హత అంశంపై స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు ( Telangana High Court ) ప్రధాన నాయకత్వ ధర్మాసనం తప్పుబట్టింది. ఈ మేరకు దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ సీజే ధర్మాసనం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.
Danam Nagender Disqualification | పిటిషన్‌లో ఏముంది?
బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారని, అంతేకాకుండా 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారని భాజపాఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరారు. పార్టీ ఫిరాయింపులపై తాము సమర్పించిన పక్కా ఆధారాలను పరిగణనలోకి తీసుకోకుండా, ఆధారాలు లేవంటూ మార్చి 11న స్పీకర్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను వారు సవాల్ చేశారు.
Danam Nagender Disqualification | ఖాళీ అయినట్లు ప్రకటన..
ఈ పిటిషన్‌పై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన సీజే ధర్మాసనం.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టి దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ తీర్పు వెలువరించింది. అలాగే ఖైరతాబాద్ శాసనసభ స్థానం ఖాళీ అయినట్లు స్పీకర్‌తో పాటు ఎన్నికల సంఘానికి (ECI) న్యాయస్థానం సమాచారం అందించింది.
ఇది కూడా చదవండి: Air India Express Pilots | నలుగురు పైలెట్లను సస్పెండ్ చేసిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్