అక్షరటుడే, వెబ్‌డెస్క్: Home Guard Arrested | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళపై దాడి ఘటనలో హోమ్ గార్డ్ ఆనంద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి మియాపూర్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మహిళను కొట్టి, ఆమె జుట్టు పట్టుకుని హోమ్‌గార్డు ఆనంద్ లాక్కెళ్లాడు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. అతడు రైల్వే పోలీసు అని మొదట ప్రచారం జరిగింది. అయితే మహిళపై దాడి చేసింది రైల్వే పోలీస్ కాదు.. తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన హోంగార్డ్ అని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
Home Guard Arrested | డిప్యుటేషన్‌పై..
హోమ్‌గార్డు ఆనంద్ డిప్యుటేషన్‌పై రైల్వే స్టేషన్ వద్ద డ్యూటీ చేస్తున్నాడని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ ఘటనపై ఆయన వివరణ ఇచ్చారు. అతనిని సర్వీస్ నుంచి తొలగించడంతో పాటు, క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించానని చెప్పారు. ఈ క్రమంలో మియాపూర్ పోలీసులు హోమ్‌గార్డు ఆనంద్‌ను అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి..: Miyapur Drug Peddler Arrest | హైదరాబాద్‌లో కలకలం రేపిన డ్రగ్స్ రాకెట్.. మియాపూర్‌లో 14 ఎక్టసీ మాత్రలతో పెడ్లర్ సురేష్ గోపీ అరెస్టు!