State Level Softball Tournament | అట్టహాసంగా రాష్ట్రస్థాయి సబ్​ జూనియర్​ సాఫ్ట్​బాల్​ పోటీలు ప్రారంభం

మండలంలోని గ్రీన్‌ఫీల్డ్ మినీ స్టేడియంలో అట్టహాసంగా రాష్ట్రాస్థాయి సబ్​ జూనియర్​ సాఫ్ట్​బాల్​ పోటీలు ప్రారంభమయ్యాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, కమ్మర్​పల్లి: State Level Softball Tournament | మండలంలోని గ్రీన్‌ఫీల్డ్ మినీ స్టేడియంలో అట్టహాసంగా రాష్ట్రస్థాయి సబ్​ జూనియర్​ సాఫ్ట్​బాల్​ పోటీలు ప్రారంభమయ్యాయి. శని, ఆదివారాల్లో జరుగనున్న ఈ టోర్నీని సర్పంచ్​ కొత్తపల్లి హారిక అశోక్ ప్రారంభించారు.

State Level Softball Tournament | క్రీడలతో మానసికోల్లాసం

సర్పంచ్ హారిక అశోక్ మాట్లాడుతూ.. క్రీడల వల్ల శారీరక, మానసిక దృఢత్వంతో పాటు సామాజికంగా కూడా విద్యార్థులు అభివృద్ధి చెందుతారని తెలిపారు. విద్యార్థులు ప్రతిరోజూ క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. కమ్మర్‌పల్లిలో రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు నిర్వహించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన సాఫ్ట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి కే. శోభన్ బాబు మాట్లాడుతూ.. ఈ టోర్నీలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈనెల 27 నుండి 30 వరకు మహారాష్ట్రలోని శంభాజీనగర్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు.

State Level Softball Tournament | జిల్లా క్రీడాకారుల ప్రతిభ భేష్​

State Level Softball Tournament

అంతర్జాతీయ పోటీల్లో నిజామాబాద్ జిల్లా (Nizamabad District) క్రీడాకారులు అత్యధికంగా పాల్గొంటున్నారని శోభన్​బాబు గుర్తుచేశారు. టోర్నీలో 22 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అభిషేక్ గౌడ్, జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్, గ్రామ ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ పరిశీలకులు, జిల్లా డీవైఎఫ్​వో పవన్ కుమార్, రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ పరిశీలకులు యాసిన్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి బి. మల్లేష్ గౌడ్, ఫిజికల్ డైరెక్టర్ వేముల నాగభూషణం, ఎం. సుజాత, చిప్ప నవీన్, రాహుల్, సాగర్, విక్రమ్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Urea Bags Missing | సొసైటీలో యూరియా బస్తాలు మాయం..అధికారులను నిలదీసిన రైతులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *