Sep 20 Gold Prices | బులియన్ మార్కెట్ అప్‌డేట్: హైదరాబాద్‌లో మళ్లీ పైపైకి పసిడి ధ‌ర‌లు!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sep 20 Gold Prices | దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. గత కొద్దిరోజులుగా కొంత మేర ఉపశమనం కలిగించిన పసిడి రేట్లు, ఇప్పుడు మళ్లీ పెరుగుదల బాట పట్టడం కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. రానున్న రోజుల్లో పసిడి ధరలు సరికొత్త రికార్డులను నమోదు చేసే అవకాశం ఉందని మార్కెట్ market విశ్లేషకుల అంచనాలు పేర్కొంటున్నాయి.

Sep 20 Gold Prices | నేటి ధరలు ఇలా..

హైదరాబాద్ బులియన్ Bullion మార్కెట్‌లోని తాజా వివరాల ప్రకారం, 24 క్యారెట్ల (99.9% స్వచ్ఛత) మేలిమి బంగారం ధర గ్రాముకు ₹15,584 కాగా, 10 గ్రాముల (తులం) ధర ₹1,55,840 వద్ద కొనసాగుతోంది.

అలాగే, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల (91.6% స్వచ్ఛత) బంగారం Gold ధర గ్రాముకు ₹14,285 గానూ (తులం ₹1,42,850), 18 క్యారెట్ల (75% స్వచ్ఛత) బంగారం రేటు గ్రాముకు ₹11,688 గానూ (తులం ₹1,16,880) నమోదైంది.

ఇది కూడా చదవండి: TASK Dell Tech Training | యువతకు డెల్ టెక్ స్కిల్స్.. టాస్క్, డెల్ భాగస్వామ్యంలో ప్రతిష్ఠాత్మక ఉడాన్ ప్రాజెక్ట్!

Sep 20 Gold Prices | ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు వరుసగా మూడో రోజు కూడా క్షీణించడంతో ద్రవ్యోల్బణ భయాలు కొంత మేర తగ్గుముఖం పట్టాయి. దీనికి తోడు అమెరికా డాలర్ విలువ, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ మందగించడంతో పెట్టుబడిదారులు తిరిగి సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించే పసిడి (బులియన్) వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రతికూల ఆర్థిక పరిస్థితుల్లో బంగారం డిమాండ్ మళ్లీ పెరగడమే ప్రస్తుత ధరల రికార్డు పరుగుకు ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *