Parivartini Ekadashi 2026 | పరివర్తిని ఏకాదశి ప్రత్యేకత… ఈ వస్తువులు దానం చేస్తే ఆర్థిక సమస్యలు దూరం

హిందూ ధర్మంలో ఏకాదశి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Parivartini Ekadashi 2026 | హిందూ ధర్మంలో ఏకాదశి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా భాద్రపద మాసంలో వచ్చే పరివర్తిని ఏకాదశిని ‘పద్మా ఏకాదశి’ లేదా ‘పార్శ్వ ఏకాదశి’ అని కూడా పిలుస్తారు. ఈ  సంవత్సరం  2026 సెప్టెంబర్ 22న ఈ పర్వదినం వచ్చింది. చాతుర్మాస దీక్షలో భాగంగా యోగనిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువు ( Vishnu ) ఈ ఏకాదశి రోజే తన భంగిమను (పార్శ్వాన్ని) మారుస్తారని ప్రతీతి. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఈ పవిత్ర రోజున భక్తిశ్రద్ధలతో పూజలు చేయడంతో పాటు, దానధర్మాలు చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలంతో పాటు జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.

Parivartini Ekadashi 2026 | తాజా పండ్ల దానం..

జీవితంలో సానుకూల ఫలితాలు రావాలన్నా, నిలిచిపోయిన డబ్బు చేతికి అందాలన్నా పరివర్తిని ఏకాదశి రోజున తాజా పండ్లను దానం చేయడం మంచిది. శ్రీమహావిష్ణువును నిష్టతో పూజించిన తర్వాత అరటిపండ్లు, ఆపిల్స్ లేదా బత్తాయి వంటి పండ్లను పేదలకు లేదా దేవాలయంలో అందించాలి. దీనివల్ల జాతకంలో గురు గ్రహ బలం పెరుగుతుందని, ఆర్థిక రంగంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు.

పసుపు వస్త్రాలు..
దాంపత్య జీవితంలో మనస్పర్థలు తొలగిపోయి, భార్యాభర్తల మధ్య బంధం బలపడాలంటే ఈ రోజు ప్రత్యేక దానాలు చేయాలి. సువాసినులకు కుంకుమ, సిందూరం, గాజులతో పాటు పసుపు రంగు వస్త్రాలను దానంగా ఇవ్వడం మంచిది. ఇది కుటుంబంలో సంతోషాన్ని నింపడంతో పాటు పరస్పర విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. అలాగే పసుపు దానం చేయడం వల్ల గురు బృహస్పతి అనుగ్రహం లభించి ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి.

Parivartini Ekadashi 2026 | పాదరక్షల దానం..

జీవితంలో పదేపదే అడ్డంకులు ఎదురవుతున్నా, కెరీర్‌లో ఆటంకాలు కలుగుతున్నా ఈ ఏకాదశి రోజు  జోళ్లు లేదా చెప్పులు దానం చేయడం విశేష ఫలితాలనిస్తుంది. నిరుపేదలకు పాదరక్షలు దానం చేయడం ద్వారా జాతకంలోని శని, రాహు గ్రహాల దుష్ప్రభావాలు శాంతిస్తాయని, అపజయాలు దూరమై ప్రశాంతత లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

గోసేవ, గోదానం..
సనాతన సంప్రదాయంలో గోవుకు ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. ఈ పవిత్ర రోజున గోదానం చేయడం లేదా గోశాలకు వెళ్లి సేవ చేయడం వల్ల గొప్ప పుణ్యఫలం దక్కుతుంది. నేరుగా గోదానం చేయడం కుదరని వారు.. గోవులకు తృణధాన్యాలు, బెల్లం, నానబెట్టిన శెనగలను తినిపించడం ద్వారా కూడా అదే ఫలితాన్ని పొందవచ్చు.

ఇది కూడా చదవండి: Bihar Girl Harassment | బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై వేధింపులు.. రాహుల్ గాంధీ ఆగ్రహం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *