Jamui Student Harassment | బీహార్‌లో విద్యార్థిని లైంగిక వేధింపుల కేసులో నిందితుడి ఎన్‌కౌంటర్

బీహార్‌లోని జముయిలో పాఠశాల విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Jamui Student Harassment | బీహార్‌లోని జముయిలో పాఠశాల విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో జాతీయ మహిళా కమిషన్ కూడా సీరియస్ అయి ఆరా తీసింది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ వేగవంతం చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Jamui Student Harassment | ఏం జరిగిందంటే..?

యూనిఫాంలో ఉన్న విద్యార్థి, విద్యార్థిని పట్ల కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించి, బూతులు మాట్లాడుతూ వేధించారు. ఈ అఘాయిత్యానికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ కావడంతో పోలీసులు వెంటనే స్పందించి తొలుత ముగ్గురిని అరెస్ట్ చేశారు. అయితే, ప్రధాన నిందితుడు సహా మరికొందరు పరారీలో ఉన్నారు.

పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు నందన్ యాదవ్, మరో నిందితుడు హరే రామ్‌ల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నిందితులను అదుపులోకి తీసుకునేందుకు వెళ్లిన పోలీసులపై వారు ఎదురుదాడికి దిగడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు నందన్ యాదవ్ కాలికి బుల్లెట్ గాయమవ్వగా, మరో నిందితుడు హరే రామ్‌కు కాలు విరిగింది. వెంటనే వారిని చికిత్స కోసం జముయి సదర్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని బీహార్ పోలీస్ లా అండ్ ఆర్డర్ ఏడీజీ కేఎస్ అనుపమ్ అధికారికంగా ధృవీకరించారు.

Jamui Student Harassment | కఠిన చట్టాల కింద కేసులు..

ఈ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. కొత్త నేర చట్టం (BNSS) లోని సెక్షన్లు 128, 74, 75తో పాటు పోక్సో (POCSO) చట్టం కింద సెక్షన్ 8, 12లను నమోదు చేశారు. అలాగే, ఈ కేసును నిష్పాక్షికంగా దర్యాప్తు చేసేందుకు జముయి ఎస్డీపీఓ పర్యవేక్షణలో ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. నిందితులపై పోలీసులు తీసుకున్న ఈ కఠిన చర్యల పట్ల స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది.

ఇది కూడా చదవండి:  India Women Gold Medal | ఆసియా గేమ్స్​ ఫైనల్​లో ఘన విజయం.. భారత్​ ఖాతాలో తొలి పసిడి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *