Meghalaya BJP Expansion | ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్.. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కమలం గూటికి

ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో బీజేపీ ‘ఆపరేషన్ ఆకర్ష్‌’తో రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Meghalaya BJP Expansion | ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో బీజేపీ ‘ఆపరేషన్ ఆకర్ష్‌’తో రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (యూడీపీ)కి చెందిన ఏకంగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి సామూహికంగా భారతీయ జనతా పార్టీలో చేరారు.

న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, ఈశాన్య రాష్ట్రాల బీజేపీ కోఆర్డినేటర్, ఎంపీ సంబిత్ పాత్ర సమక్షంలో వీరంతా లాంఛనంగా కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈశాన్య భారతంలో జరుగుతున్న అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన చూసి ఆకర్షితులై వీరు బీజేపీలో చేరినట్లు కిరణ్ రిజిజు వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిపిన చర్చలు, స్థానిక సమస్యల పరిష్కార హామీల మేరకే వీరు బీజేపీ గూటికి చేరినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

Meghalaya BJP Expansion |రెండో అతిపెద్ద పార్టీగా ..

ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేల చేరికతో 60 స్థానాలున్న మేఘాలయ శాసనసభలో బీజేపీ బలం ఒక్కసారిగా 2 నుండి 10కి పెరిగింది. దీంతో కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్‌పీపీ తర్వాత అసెంబ్లీలో బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మరోవైపు, యూడీపీ బలం 12 నుండి 4 స్థానాలకు పడిపోయింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈశాన్య ప్రాంతంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఈ పరిణామాలు భారీ మైలేజీని అందిస్తాయని సంబిత్ పాత్ర ధీమా వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:  Kavitha RIMS Fire| నెల రోజుల్లోగా డిమాండ్లు నెరవేర్చాలి.. రిమ్స్ ఘటనపై రేవంత్ రెడ్డికి కవిత అల్టిమేటం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *