అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rahul Gandhi Protest | ప్రధానమంత్రి Prime Minister నరేంద్ర మోడీ Modi అధికారిక నివాసం సమీపంలో కాంగ్రెస్ చేపట్టిన నిరసన సందర్భంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పలువురు పార్టీ నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విడుదల చేశారు.
Rahul Gandhi Protest | ఫొటోలు నెట్టింట వైరల్
నిరసన సందర్భంగా రాహుల్ గాంధీని పోలీసులు అక్కడి నుంచి తరలించే క్రమంలో ఆయన ముక్కు వద్ద రక్తస్రావం అయినట్లు కనిపించే ఫొటోలను కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో పోస్టు చేసింది.
ఈ ఘటనపై కాంగ్రెస్ నేతలు పోలీసుల తీరును తీవ్రంగా విమర్శించారు. అయితే గాయానికి సంబంధించిన అధికారిక వైద్య వివరాలు లేదా ఢిల్లీ పోలీసుల నుంచి పూర్తి వివరణ వెలువడాల్సి ఉంది.
Rahul Gandhi Protest | ఎంపీల రిలీజ్..
అదుపులోకి తీసుకున్న అనంతరం రాహుల్ గాంధీని మోడల్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు, ప్రియాంక గాంధీని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తర్వాత ఇద్దరినీ విడుదల చేశారు. కాంగ్రెస్ ఎంపీలు, ఇతర నేతలను కూడా పోలీసులు విడుదల చేసినట్లు సమాచారం.
విద్యార్థుల ఆందోళనలపై జరిగిన పోలీసు చర్యకు నిరసనగా, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఘటనతో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ విమర్శలు మరోసారి వేడెక్కాయి.