Nizamabad IT Tower | ఐటీ టవర్​ను సందర్శించిన కలెక్టర్ భవేష్​ మిశ్రా

జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్​ను కలెక్టర్ భవేష్ మిశ్రా బుధవారం సందర్శించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad IT Tower | జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్​ను కలెక్టర్ భవేష్ మిశ్రా (Collector Bhavesh Mishra) బుధవారం సందర్శించారు. ఐటీ టవర్ కేంద్రంగా కొనసాగుతున్న వివిధ కంపెనీల వివరాలను, వాటి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు.

Nizamabad IT Tower | 13 కంపెనీల్లో..

ప్రస్తుతం 13 కంపెనీలలో 380 మంది వరకు పని చేస్తున్నారని టీజీఐఐసీ జోనల్ మేనేజర్ శివ ప్రసాద్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయా కంపెనీల నిర్వాహకులను, అందులో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులను కలిసి స్థానికంగా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. సాధ్యమైనంత మేరకు ఎక్కువ కంపెనీలు స్థానికంగా నెలకొల్పేలా చూడాలని, తద్వారా ఈ ప్రాంత యువతకు స్థానికంగా మరింత ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించేందుకు ఆస్కారం ఉంటుందని కలెక్టర్ సూచించారు. వినూత్న ఆలోచనలు, సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు వచ్చే స్టార్టప్​ కంపెనీలకు ఐటీ టవర్ చక్కటి వేదికగా నిలుస్తుందని, దీనిని ఔత్సాహికులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట టీజీఐఐసీ ఏఈ శివకృష్ణ ఉన్నారు.

ఇది కూడా చదవండి..: Ganesh Immersion Safety | శోభాయాత్రలో మండపాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *