Market Volatility | ఒడిదుడుకుల్లో మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం ఒడిదుడుకులకు లోనవుతోంది. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 237 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 3 పాయింట్ల లాభంంతో ఉన్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Market Volatility | క్రూడ్ ఆయిల్ ధర దిగివచ్చినా జియో పొలిటికల్ టెన్షన్స్ కొనసాగుతుండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతోంది. ప్రధాన సూచీలు మిశ్రమంగా కదలాడుతున్నాయి. ఐటీ, బ్యాంకులు లాభాలతో ఉండగా.. ఫార్మా, మెటల్ రంగాలు నష్టాల బాటలో సాగుతున్నాయి.

Market Volatility | నష్టాలతో ప్రారంభం..

దేశీయ మార్కెట్లు (Domestic markets) బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 88 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మొదట్లో 51 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 620 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 48 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా.. కనిష్టాల వద్ద వాల్యూ బయ్యింగ్‌తో కోలుకుని 458 పాయింట్లు ఎగబాకింది. అయితే ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండి లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో 459 పాయింట్లు పడిపోయింది. సెన్సెక్స్ 57 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మొదట్లో 106 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి అమ్మకాల ఒత్తిడితో 112 పాయింట్లు కోల్పోయింది. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 237 పాయింట్ల లాభంతో 72,767 వద్ద, నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో 22,719 వద్ద ఉన్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 18 స్టాక్స్ లాభాలతో, 12 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ 2.78 శాతం, కొటక్ బ్యాంక్ 1.87 శాతం, టీసీఎస్ 1.78 శాతం, హెచ్సీఎల్ టెక్ 1.31 శాతం, ఇండిగో 1.17 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : ఎటర్నల్ 2.60 శాతం, సన్‌ఫార్మా 2.09 శాతం, అదానీ పోర్ట్స్ 1.87 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.43 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.30 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Bulk FD Rules 2026 | బ్యాంకు ఎఫ్‌డీదారులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *