Sep 04 Market Analysis | లాభాల్లో గ్లోబల్ మార్కెట్లు..పాజిటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు లాభాల బాటలో సాగుతున్నాయి. మన మార్కెట్లు సైతం పాజిటివ్ గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sep 04 Market Analysis | నిర్దేశించిన 2 శాతం లక్ష్యం వైపు ద్రవ్యోల్బణం కొనసాగితే ‘పాలసీ రేటును ప్రస్తుత స్థాయిలో కొనసాగించడానికి నేను మద్దతు ఇస్తాను’ అన్న ఫెడ్ ఛైర్మన్ వాలర్ వ్యాఖ్యలతో మార్కెట్ ఊపిరి పీల్చుకుంది.

ఆగస్టు 29తో ముగిసిన వారానికి సంబంధించిన ప్రాథమిక నిరుద్యోగ క్లెయిమ్‌లు స్థూలంగా అంచనాలకు అనుగుణంగానే ఉండడంతో సెప్టెంబర్‌లో ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం కంటే యథాతథంగా ఉంచే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ అంచనా వేస్తోంది. దీంతో గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్‌గా సాగుతున్నాయి.

Sep 04 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 1.40 శాతం, ఎస్ అండ్ పీ 1.06 శాతం పెరిగాయి. శుక్రవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.01 శాతం లాభంతో ఉంది.

Sep 04 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

యూకే UK కు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.69 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.07 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.63 శాతం లాభంతో ముగిశాయి.

Husband Wife Dispute | భర్త వద్దు.. ప్రియుడే ముద్దు : కొడుకు, ఆస్తులపై హక్కులు వదులుకుంటానని భార్య రాతపూర్వక హామీ

Sep 04 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా Asia మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 2.07 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 1.28 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.88 శాతం లాభంతో, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.85 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.64 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.61 శాతం లాభంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.38 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్‌లో నికరంగా రూ. 2,345 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు వరుసగా 18 వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 4,977 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.87 నుంచి 0.80కు తగ్గింది.
  • విక్స్ 2.2 శాతం పెరిగి 11.34 వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 49 పైస బలపడి 94.49 వద్ద ఉంది.
  • క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 95.82 డాలర్ల వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 99 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.77 వద్ద ఉన్నాయి.
Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *