అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mixed Trap Shooting | ఆసియా క్రీడల్లో (Asian Games) బుధవారం భారత్ హవా కొనసాగుతోంది. ఏకంగా మూడు స్వర్ణ పతకాలను సాధించింది. అంతేగాకుండా పలు విభాగాల్లో ఫైనల్‌కు చేరి కనీసం రజత పతకాలను భారత క్రీడాకారులు ఖాయం చేసుకున్నారు.
షూటింగ్ ట్రాప్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో నీరూ ధండా, కైనాన్ చెనై అద్భుత ప్రదర్శనతో పసిడి పతకం సాధించారు. మొదట్లో లక్ష్యాలను చేధించలేకపోయిన ఈ జంట.. తర్వాత పుంజుకుంది. కొట్టిన ప్రతి షాట్‌ను విజయవంతంగా ఛేదించి ఒక్క పాయింట్ తేడాతో ఖతార్‌ను ఓడించింది. నీరూ దండా మంగళవారం వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్, మహిళల టీమ్ ఈవెంట్లో సిల్వర్ మెడల్ సాధించింది. తాజాగా మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో గోల్డ్ మెడల్‌తో ఆకట్టుకుంది. రెండు రోజుల వ్యవధిలో ఆమె 3 పతకాలు సాధించడం గమనార్హం. భారత మిక్స్డ్ టీమ్ మొత్తం 34 పాయింట్లతో ఆసియా రికార్డును కూడా నెలకొల్పింది.
Mixed Trap Shooting | బాక్సింగ్‌లో కాంస్యం
బాక్సింగ్ 60 కేజీల సెమీ-ఫైనల్లో భారత క్రీడాకారిని ప్రియా ఘంగాస్ ఓడిపోయింది. దీంతో ఆమెకు కాంస్యం దక్కింది. మరోవైపు లవ్లీనా బోర్గోహైన్ సెమీస్‌లో గెలుపొంది 75 కేజీల ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఫైనల్లో గెలిస్తే గోల్డ్, ఓడితే సిల్వర్ మెడల్ దక్కనుంది. తన్వి ఖన్నా, అనాహత్ సింగ్‌ల మహిళల స్క్వాష్ జట్టు సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లి మరో పతకాన్ని ఖాయం చేసుకుంది.
ఇది కూడా చదవండి..: Asian Games Archery | భారత్ గురి అదిరింది.. ఆర్చరీలో రెండు బంగారు పతకాలు