అక్షరటుడే, వెబ్‌డెస్క్: National Critical Mineral Mission | కేంద్ర ప్రభుత్వం గనుల మంత్రిత్వ శాఖ ద్వారా ‘ఈ-వేస్ట్’ (ఎలక్ట్రానిక్ వ్యర్థాల) నిర్వహణకు సంబంధించిన ఒక కార్యక్రమాన్ని చేపడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. ఈ-వేస్ట్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన మూడు కార్యక్రమాల ద్వారా మనం ఈ వ్యర్థాలను సేకరించి, వేరు చేసి, రీసైకిల్ చేయాలన్నారు. రూ. 46,000 కోట్ల ప్రోత్సాహకంతో భారత ప్రభుత్వం ‘నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్’ను ప్రారంభించిందని చెప్పారు.
National Critical Mineral Mission | స్వచ్ఛ భారత్ కార్యక్రమం
చాణక్యపురి ప్రాంతంలోని యశ్వంత్ ప్లేస్‌లో జరిగిన స్వచ్ఛతా కార్యక్రమంలో జి. కిషన్ రెడ్డి రోడ్లను శుభ్రం చేశారు. ఆయన మాట్లాడుతూ..గాంధీ జయంతి నుండి అక్టోబర్ 31న వచ్చే సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వరకు 30 రోజుల పాటు – దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఈ ‘స్వచ్ఛ భారత్’ ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు (NGOలు), కాలనీ అసోసియేషన్లు ‘స్వచ్ఛ భారత్ వారియర్స్’ (పారిశుధ్య కార్మికులు) అందరూ కలిసి ఈ 30 రోజుల కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు.
ఇది కూడా చదవండి..: Smit Machchhar Flydubai | నువ్వు నిజమైన హీరో.. మచ్చార్ సాహసంపై ప్రధాని మోదీ ప్రశంసలు