CJP Delhi Protest | సీజేపీ ఆందోళన.. ఢిల్లీలో ఇంటర్నెట్ బంద్

ఎస్​ఐఆర్​కు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసనకు పిలుపునివ్వడంతో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CJP Delhi Protest | ఎస్​ఐఆర్​ ప్రక్రియను నిలిపివేయాలని, సీఈసీ జ్ఞానేశ్​కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్​ చేస్తూ కాక్రోచ్​ జనతా పార్టీ నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీలో జంతర్​మంతర్​ వద్ద ధర్నా చేపడుతామని సీజేపీ తెలిపింది.

సీజేపీ (Cockroach Janata Party) పిలుపుతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ధర్నా చౌక్​ వద్ద భారీగా మోహరించారు. మరోవైపు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్​ సేవలు నిలిపివేశారు. భద్రతా కారణాలతో 11 మెట్రో స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు మూసివేశారు. జంతర్ మంతర్, కన్నాట్ ప్లేస్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. మరోవైపు ఎస్​ఐఆర్​ ప్రక్రియకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఎస్​ఎఫ్​ఐ, డీవైఎఫ్​ఐ సభ్యులను పోలీసులు అరెస్ట్​ చేశారు.

CJP Delhi Protest | అనుమతి లేకున్నా..

సీజేపీ నిరసనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినా కూడా తాము ఆందోళన చేపడుతామని సీజేపీ నాయకులు ప్రకటించారు. దీంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ సమావేశానికి సుమారు 3,000 నుండి 4,000 మంది హాజరయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. ముంబైలోని శివాజీ పార్క్ వద్ద కూడా CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నిరసన చేపట్టనున్నారు. ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, ఆయన రాజీనామా చేయాలని CJP డిమాండ్ చేస్తోంది. దీంతో ముంబైలోని శివాజీ పార్క్​ వద్ద సైతం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఇది కూడా చదవండి..: Sugar Stock Rules | షుగర్ వ్యాపారులకు బిగ్ షాక్.. నిల్వలపై కేంద్రం కఠిన నిబంధనలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *