అక్షరటుడే వెబ్‌డెస్క్: Son in Law Shraddha | హిందూ సంప్రదాయంలో పితృ పక్షం రోజుల్లో పూర్వీకులకు శ్రాద్ధం, తర్పణం, పిండదానం వంటి కర్మలు చేయడం చాలా ముఖ్యం. అయితే సాధారణంగా ఈ కర్మలను కుటుంబంలోని కుమారుడు లేదా మగ సంతానం నిర్వహిస్తారని మనకు తెలుసు. మరి ఒకవేళ కుటుంబంలో మగ సంతానం లేకపోతే పరిస్థితి ఏంటి? అల్లుడు తన అత్తమామలకు శ్రాద్ధం లేదా పిండదానం చేయవచ్చా? ఈ అంశంపై గరుడ పురాణం ( Garuda Purana ) , ధర్మశాస్త్రాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Son in Law Shraddha | మొదటి హక్కు ఎవరికి ..
సంప్రదాయాల ప్రకారం పూర్వీకులకు శ్రాద్ధ కర్మలు చేసే ప్రధాన బాధ్యత కుమారుడిదే. కుమారుడు లేకపోతే ఆ వంశ క్రమాన్ని బట్టి మనవడు లేదా ఇతర సమీప బంధువులు ఈ కర్మలు చేయవచ్చు. ముఖ్యంగా కూతురికి కుమారుడు (దౌహిత్రుడు) ఉంటే, అతనికి కూడా పితృకర్మలు చేసే అర్హత ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
Son in Law Shraddha | ‘పుత్రుడు’ అనే పదానికి అర్థం..
హిందూ ధార్మిక గ్రంథాల ప్రకారం ‘పు’ అనే నరకం నుంచి ‘త్ర’ (రక్షించేవాడు) అంటే తల్లిదండ్రులకు అంత్యక్రియలు, శ్రాద్ధాలు చేసి వారిని రక్షించేవాడే పుత్రుడు అని చెబుతారు. ఈ భావన కారణంగానే పితృకర్మల్లో కుమారుడికి ప్రత్యేక స్థానం దక్కింది. అయితే ఇది కేవలం ధార్మిక విశ్వాసం, వ్యాఖ్యానంగా మాత్రమే చూడాలి.
Son in Law Shraddha | అల్లుడు శ్రాద్ధం చేయవచ్చా?
అన్ని సంప్రదాయాల్లోనూ దీనికి ఒకే రకమైన నిబంధన లేదు. సాధారణ ధర్మశాస్త్ర నియమాల ప్రకారం.. అత్తమామల అంత్యక్రియలు లేదా ప్రధాన పితృకర్మల్లో అల్లుడికి మొదటి హక్కు ఉండదు. మొదట కుమారుడు, మనవడు, దౌహిత్రులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తారు. అయితే, కుటుంబంలో అర్హత కలిగిన ఇతర వారసులు ఎవరూ లేని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం అల్లుడు ముందుకు వచ్చి ఈ కర్మలను నిర్వహించే అవకాశం ఉందని కొన్ని సంప్రదాయ గ్రంథాలు పేర్కొంటున్నాయి.
అయితే ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో కుటుంబ ఆచారాలను గౌరవిస్తూ, పండితులు లేదా కుటుంబ పురోహితుల సూచనల మేరకు ఈ కార్యక్రమాలు చేయడం మంచిది. అల్లుడు శ్రాద్ధం చేస్తే తప్పులేదని, కుటుంబ పరిస్థితిని బట్టి ఆచారాలు మారుతుంటాయని పండితులు స్పష్టం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Nizamabad Journalists Protest | జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన తప్పదు