అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pranavi Urs Gold Medal | ఆసియా క్రీడల్లో (Asian Games) శనివారం భారత్ సంచలన విజయాలు నమోదు చేసి రెండు స్వర్ణ పతకాలు గెలుచుకుంది. గోల్ఫ్‌లో తొలిసారి భారత్ పసిడి పతకం నెగ్గింది.
గోల్ఫ్ మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లేలో ప్రణవి ఉర్స్ స్వర్ణం సాధించింది. అంతేగాకుండా అదితి అశోక్, దీక్షా దాగర్‌లతో కలిసి టీమ్ ఈవెంట్‌లో రజత పతకం సాధించింది. ఉత్కంఠభరితమైన ఫైనల్ రౌండ్‌లో, షానన్ టాన్, యిన్ రుయోనింగ్‌లతో కలిసి ప్రణవి చివరి హోల్‌లో పార్ సాధించి తన సంయమనాన్ని కోల్పోలేదు. నాలుగు రౌండ్ల తర్వాత భారత స్టార్ 15-అండర్ పార్ స్కోరుతో అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకం గెలుచుకుంది. టీమ్ ఈవెంట్‌లో ప్రణవి, అదితి అశోక్, దీక్షా దాగర్‌లతో కూడిన భారత జట్టుపై చైనా 22-అండర్ పార్ స్కోరుతో విజయం సాధించింది. దీంతో భారత్ సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకుంది.
Pranavi Urs Gold Medal | ఒలింపిక్స్‌కు అర్హత
భారత క్రీడాకారిణి కుంకుమ్ మొహోద్ మహిళల రికర్వ్ వ్యక్తిగత ఆర్చరీ ఈవెంట్‌లో స్వర్ణాన్ని సాధించింది. ఈ విభాగంలో భారతదేశానికి మొట్టమొదటి ఛాంపియన్‌గా ఆమె నిలిచింది. అంతేగాకుండా ఈ విజయంతో లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్ క్రీడలకు అర్హత సాధించింది. తైక్వాండ మహిళల 57 కేజీల రౌండ్ ఆఫ్ 16లో కషిష్ మాలిక్, కిమ్ యుజిన్ చేతిలో 0-2 తేడాతో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం భారత్ 17 బంగారు పతకాలు సహా మొత్తం 77 మెడల్స్‌లో ఐదో స్థానంలో కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి..: Women’s Hockey | మహిళల హాకీలో భారత్‌కు గోల్డ్ మెడల్