Supreme Court Delhi Police | వారి మనసుల్లో భయం సృష్టించాలి.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

లైంగిక నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తుల మనసుల్లో భయాన్ని కలిగించాలని సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులకు సూచించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Supreme Court Delhi Police | లైంగిక నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తుల మనసుల్లో భయాన్ని కలిగించాలని సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులకు సూచించింది. అమ్మాయిలను వేధించే పోకిరీలు తిరిగే కళాశాలలపై దృష్టి సారించాలని ఆదేశించింది.

ఢిల్లీ (Delhi), పరిసర ప్రాంతాల్లో ఇటీవల జరిగిన అత్యాచార ఘటనలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా విచారణ చేపట్టింది. లైంగిక నేరానికి పాల్పడితే కచ్చితంగా మరణశిక్ష, మరణం తప్పదనే భయాన్ని అసాంఘిక శక్తుల మనసుల్లో కలిగించకపోతే ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉంటాయని కోర్టు పేర్కొంది. దక్షిణ ఢిల్లీలోని ఒక బాలికల కళాశాలకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పార్కులో జరిగిన సామూహిక అత్యాచార ఘటనను ప్రస్తావిస్తూ, పోలీసులు తీసుకోవాల్సిన ముందస్తు చర్యల గురించి సుప్రీంకోర్టు వారిని ప్రశ్నించింది.

Supreme Court Delhi Police | వార్​ రూమ్​ ఏర్పాటు చేయాలి

ఇలాంటి నేరాలు ఆగిపోయేలా చూడాలని, మనం కలిసి పనిచేస్తే మార్పు తీసుకురావచ్చు అని జస్టిస్ పార్దీవాలా అన్నారు. రాజధానిలో ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక ‘వార్ రూమ్’ ఏర్పాటు చేయాలని సూచించారు. అనుమానితుల కదలికలను పర్యవేక్షించాలని కూడా కోర్టు సూచించింది. కాలేజీల వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించింది. అక్కడ అమ్మాయిలను వేధించే గూండాలు తిరుగుతుంటారని పేర్కొంది. ఢిల్లీ అంతటా వేలాది అనధికారిక ఆహార విక్రయ కేంద్రాలు ఉన్నాయని, అక్కడ అసాంఘిక శక్తులు గుమిగూడుతాయని తమకు తెలిసిందన్నారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఢిల్లీ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఇదికూడా చదవండి: Simran Patel Arrest | గాంధీజీని అవమానించేలా రీల్.. మహిళ అరెస్ట్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *