Tiruchanur Elephant Attack | ఏనుగు దాడిలో గాయపడిన మావటికి పరామర్శ

విషయం తెలుసుకున్న టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి ఆసుపత్రికి వెళ్లి చంద్రయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tiruchanur Elephant Attack | శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద ఆదివారం జరిగిన ఏనుగు దాడి ఘటనలో గాయపడిన మావటి చంద్రయ్యను టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి పరామర్శించారు.

ఆలయానికి చెందిన శ్రీనిధి అనే ఏనుగు ప్రమాదవశాత్తు మావటి చంద్రయ్యపై దాడి చేయడంతో ఆయన గాయపడ్డారు. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం సిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.

Tiruchanur Elephant Attack | మెరుగైన వైద్యం అందించాలని సూచన

ఈ విషయం తెలుసుకున్న టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి ఆసుపత్రికి వెళ్లి చంద్రయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులతో మాట్లాడారు. చంద్రయ్యకు మెరుగైన వైద్యం అందించి, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు. చంద్రయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Akshara Today | Fearless Journalism, a Growing Voice for the People..

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *