ACB Raid | రూ.4 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. ప్రజల నుంచి భారీగా లంచాలు తీసుకుంటున్నారు. పనులు చేయడానికి రూ.లక్షలు డిమాండ్​ చేస్తున్నారు. సోమవారం రూ.లక్ష లంచం తీసుకుంటూ డీఎంహెచ్​వో దొరికిన విషయం తెలిసిందే. తాజాగా రూ.4 లక్షల లంచం తీసుకుంటూ టౌన్​ ప్లానింగ్​ సూపర్​వైజర్​ ఏసీబీ (ACB)కి చిక్కారు.

హైదరాబాద్ (Hyderabad) నగరంలోని మెహిదీపట్నం జీహెచ్​ఎంసీ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఓ వ్యక్తి నుంచి రూ.4 లక్షల లంచం తీసుకుంటుండగా GHMC టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ తులసిరామ్ సునీతను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ACB Raid | భవన నిర్మాణ అనుమతుల కోసం..

GHMC డిప్యూటీ కమిషనర్ జారీ చేసిన ఆదేశాలను పట్టించుకోకుండా భవన నిర్మాణానికి అనుమతించడంతో పాటు, ఇకపై ఎటువంటి వేధింపులు లేకుండా సహకరిస్తామని చెప్పేందుకు ఆమె రూ.8 లక్షలు డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సోమవారం ఫిర్యాదుదారుడి నుంచి రూ.4 లక్షలు తీసుకుంటుండగా సూపర్​వైజర్​ సునీతను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు చేశారు. ఈ సమయంలో ఆమె దగ్గర లెక్కల్లో చూపని మరో రూ.2.5 లక్షల నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

దీనిని కూడా చదవండి : DMHO Caught by ACB | రూ.లక్ష లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన డీఎంహెచ్​వో

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *