అక్షరటుడే, వెబ్‌డెస్క్ : DMHO Caught by ACB | రంగారెడ్డి (Rangareddy) జిల్లా డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ మేరకు కార్యాలయంలో అధికారులు సోమవారం దాడులు చేపట్టారు.
రాజేంద్రనగర్‌లోని రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. హెల్త్ ఇన్స్పెక్టర్, ఓ ప్రైవేట్ డ్రైవర్ ద్వారా డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జిల్లాలోని ఓ ప్రైవేట్ ఫిజియోథెరపీ సెంటర్‌ను ఇటీవల వైద్యారోగ్య శాఖ అధికారులు సీజ్ చేశారు. దానిని తిరిగి తెరవడానికి అనుమతి కోసం డీఎంహెచ్‌వో రూ.రెండు లక్షల లంచం డిమాండ్ చేశారు.
DMHO Caught by ACB | డ్రైవర్ ద్వారా..
హెల్త్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ డ్రైవర్ మద్దురి కృష్ణయ్య ద్వారా డీఎంహెచ్‌వో లంచం అడిగారు. ఈ మేరకు కృష్ణయ్య సోమవారం ఫిర్యాదుదారుడి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఈ కేసులో డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి, హెల్త్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌పై సైతం కేసు నమోదు చేశారు. డ్రైవర్ కృష్ణయ్య డీఎంహెచ్‌వో, హెల్త్ ఇన్స్పెక్టర్ తరపున మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.
దీనిని కూడా చదవండి : BC Commission Visit | 7న నిజామాబాద్‌కు బీసీ కమిషన్.. వీడీసీల బహిష్కరణలపై సమావేశం