అక్షరటుడే వెబ్‌డెస్క్: Vedanta Power Sales | భారతదేశంలోని ప్రముఖ విద్యుత్ ఉత్పాదక సంస్థల్లో ఒకటైన వేదాంత పవర్ లిమిటెడ్.. ఆర్థిక సంవత్సరం 2027 రెండో త్రైమాసికం (Q2) అలాగే మొదటి అర్ధభాగం (H1) పనితీరు వివరాలను వెల్లడించింది. కంపెనీ అద్భుతమైన వృద్ధిని సాధించి సరికొత్త రికార్డులను నమోదు చేసింది.
Vedanta Power Sales | రికార్డు స్థాయిలో విక్రయాలు..
రెండవ త్రైమాసికం (Q2): గతేడాదితో పోలిస్తే 26% వృద్ధితో ఏకంగా 5,593 మిలియన్ యూనిట్ల విద్యుత్ అమ్మకాలను కంపెనీ నమోదు చేసింది.
మొదటి అర్ధభాగం (H1): ప్లాంట్ల మెరుగైన పనితీరు కారణంగా, ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో మొత్తం 10,817 మిలియన్ యూనిట్ల విద్యుత్ విక్రయాలు జరిగాయి. ఇది గతేడాదితో పోలిస్తే 32% ఎక్కువ కావడం విశేషం.
Vedanta Power Sales | పెరుగుదలకు కారణాలు..
ఈ రికార్డు వృద్ధికి ముఖ్యంగా రెండు ప్లాంట్లు కీలక పాత్ర పోషించాయి.
మీనాక్షి ఎనర్జీ: ఈ ప్లాంట్‌లో విద్యుత్ అమ్మకాలు గతంతో పోలిస్తే ఏకంగా 111% పెరిగి 1,470 మిలియన్ యూనిట్లకు చేరాయి. ఇక మొదటి అర్ధభాగంలో ఇది 160% వృద్ధితో 2,820 మిలియన్ యూనిట్లను తాకింది. 1,000 మెగావాట్ల సామర్థ్యంతో విస్తరించిన ఈ ప్లాంట్ వాటా కంపెనీ అమ్మకాల్లో బాగా పెరిగింది.
ఝార్సుగూడ థర్మల్ ప్లాంట్: రెండవ త్రైమాసికంలో ఇక్కడ అమ్మకాలు 186% పెరిగి 873 మిలియన్ యూనిట్లకు చేరాయి. ముఖ్యంగా ఈ ప్లాంట్ పనితీరు అద్భుతంగా మెరుగైంది. గత ఏడాది 43% ఉన్న ప్లాంట్ అవైలబిలిటీ ఫ్యాక్టర్ (PAF) ఈసారి ఏకంగా 98%కి పెరగడం విశేషం.
Vedanta Power Sales | స్థిరమైన పనితీరు ..
వీటితో పాటు తల్వండీ సాబో థర్మల్ ప్లాంట్ కూడా స్థిరమైన ఫలితాలను అందించింది. రెండో త్రైమాసికంలో ఇక్కడ 6% వృద్ధితో 2,945 మిలియన్ యూనిట్ల అమ్మకాలు జరిగాయి. పంజాబ్ ( Punjab ) ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 80% ప్రామాణిక లభ్యత ఉండాల్సి ఉండగా, ఈ ప్లాంట్ ఏకంగా 86% లభ్యతను నమోదు చేసి అంకితభావాన్ని చాటుకుంది. దేశ పెరుగుతున్న ఇంధన అవసరాలను తీరుస్తూ, నమ్మకమైన విద్యుత్‌ను నిరంతరం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వేదాంత పవర్ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: BC Commission Visit | 7న నిజామాబాద్‌కు బీసీ కమిషన్.. వీడీసీల బహిష్కరణలపై సమావేశం