Water Bill Update Scam | వాటర్ బిల్ అప్‌డేట్ పేరుతో సైబర్​ మోసాలు

వాటర్​ బిల్​ అప్​డేట్ పేరుతో ప్రజల ఖాతాలను సైబర్​ నేరగాళ్లు ఖాళీ చేస్తున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Water Bill Update Scam | హైదరాబాద్ (Hyderabad) నగరంలో వాటర్​ బిల్​ అప్​డేట్ పేరుతో సైబర్​ మోసాలకు పాల్పడుతున్నారు. జలమండలి పేరుతో లింక్​లు పంపి వినియోగదారుల ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఈ క్రమంలో జలమండలి అధికారులు ప్రజలకు కీలక సూచనలు చేశారు.

వాటర్ బిల్ అప్‌డేట్, బిల్లు బకాయి, కనెక్షన్ తొలగింపు తదితర పేర్లతో వినియోగదారులను సైబర్​ నేరస్తులు మోసం చేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి జలమండలి పేరు, వాటర్ బిల్ అప్‌డేట్ పేరుతో వచ్చే ఫోన్​ కాల్స్​, మెసెజ్​లకు స్పందించవద్దని అధికారులు సూచించారు. ఎలాంటి లింక్​లు క్లిక్​ చేయొద్దని, ఎట్టి పరిస్థితుల్లో ఏపీకే ఫైల్స్​ డౌన్​లోడ్​ చేసుకోవద్దన్నారు. ఏదైనా సమాచారం కావాల్సి వస్తే అధికారిక వెబ్​సైట్​, టోల్​ఫ్రీ నంబర్లను సంప్రదించాలన్నారు.

Water Bill Update Scam | వెంటనే ఫిర్యాదు చేయాలి

సైబర్​ మోసాలకు గురైతే బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని జలమండలి సూచించింది. అంతేగాకుండా ఆయా బ్యాంకులను సంప్రదించి అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. వాటర్ బిల్ పేరుతో వచ్చే ప్రతి సందేశాన్ని అధికారికమైనదిగా భావించకుండా, దాని ప్రామాణికతను నిర్ధారించుకున్న తర్వాతే స్పందించాలని కోరింది.

ఇది కూడా చదవండి: Medipally Jewellery Robbery | మేడిపల్లిలోని డైమండ్స్​ జువెల్లరీలో భారీ చోరీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *