Bird Flu in Anantapur | బర్డ్ ఫ్లూ కలకలం.. 2,500 కోళ్లు మృతి

ఆంధ్రప్రదేశ్​లోని అనంతరపురంలో బర్డ్​ ఫ్లూ కలకలం రేపింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bird Flu in Anantapur | ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh)​లోని అనంతరపురంలో బర్డ్​ ఫ్లూ కలకలం రేపింది. ఓ పౌల్ట్రీ ఫామ్​లో 2,500 కోళ్లు మృతి చెందాయి. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

బుక్కరయసముద్రం మండలం పరిధిలోని సిద్దరాంపురం గ్రామంలో ఇటీవల ఏర్పాటు చేసిన ఫారానికి ఆదిలాబాద్​ నుంచి కోళ్లను తీసుకొచ్చారు. దీంతో కొన్ని కోళ్లు మృతి చెందాయి. అనంతరం భారీ సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో రైతు ఆందోళన చెందాడు. అధికారులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి పరిశీలించారు. ఆదిలాబాద్ నుంచి వచ్చిన కోళ్ల గుంపు వల్లే ఫారంలో బర్డ్​ ఫ్లూ వ్యాపించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

Bird Flu in Anantapur | అధికారుల చర్యలు

కోళ్లు మరణించడతో అధికారులు శాంపిల్స్​ సేకరించి భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (NIHSAD) పంపించారు. ఆదివారం అందిన నివేదికలో అది బర్డ్ ఫ్లూ అని వెలువడింది. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. వ్యాధి సోకిన ఫామ్‌ను, బతికి ఉన్న కోళ్లను క్వారంటైన్‌లో ఉంచారు. కలుషితమై ఉండవచ్చని భావిస్తున్న గుడ్లు, కోళ్ల ఎరువు, మట్టి ఇతర పదార్థాలను కూడా వేరు చేశారు. ఫామ్‌కు 10 కిలోమీటర్ల పరిధిలో నివారణ మరియు నిఘా చర్యలు అమలులో ఉన్నాయి. చనిపోయిన పక్షులను పూడ్చిపెడుతున్నారు. మూడు నెలల పాటు గ్రామంలోకి కోళ్ల రాకపోకలను నిషేధిస్తామని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: AP Police Commissionerates | కొత్తగా నాలుగు పోలీస్ కమిషనరేట్లు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *