MSME Growth Fund | దేశ ఆర్థిక వ్యవస్థకు బూస్ట్.. రూ. 10,000 కోట్ల ఎంఎస్ఎంఈ ఫండ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం

దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:  MSME Growth Fund | దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME) అభివృద్ధికి భారీ ఊతమిచ్చేలా ఏకంగా రూ. 10,000 కోట్ల ‘ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్’ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే, దేశ రవాణా , లాజిస్టిక్ రంగాన్ని సమూలంగా మార్చేందుకు ‘ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్టు అండ్ లాజిస్టిక్స్ అథారిటీ’ (ITLA) ఏర్పాటుకు కూడా అంగీకారం తెలిపింది.

MSME Growth Fund |గ్రోత్ ఫండ్ ప్రత్యేకతలు..

దేశంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలు వేగంగా వృద్ధి చెందడానికి, వాటికి ప్రత్యక్ష ఈక్విటీ పెట్టుబడులు (Direct Equity Investments) అందించేందుకు ఈ నిధిని కేటాయించారు. చిన్న వ్యాపారాలు ఉన్నత స్థాయికి ఎదగడంతో పాటు, అంతర్జాతీయ మార్కెట్లో ఇతర దేశాల కంపెనీలతో దీటుగా పోటీ పడేందుకు ఈ ఫండ్ ఎంతగానో సహకరిస్తుంది. తాజా నిధులలో సింహభాగం తయారీ (Manufacturing) రంగానికి, ఇతర పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహించే సంస్థలకు దక్కనుంది. కేవలం స్వల్పకాలిక రుణాలకే పరిమితం కాకుండా, ఈక్విటీ రూపంలో ఆర్థిక సాయం అందించడం ద్వారా చిన్న వ్యాపారాలపై ఉన్న రుణ భారాన్ని గణనీయంగా తగ్గించనున్నారు.

MSME Growth Fund | ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్టు ..

దేశంలో రవాణా, లాజిస్టిక్ రంగాలను మరింత అభివృద్ధి చేయడానికి, వివిధ రవాణా మార్గాలను ఒకదానితో ఒకటి అనుసంధానించడానికి ‘ఐటీఎల్ఏ’ (ITLA) ఎంతగానో ఉపయోగపడనుంది. రైల్వేలు, రోడ్లు, పోర్టులు, విమానయాన రంగాలను మరింత మెరుగ్గా కనెక్ట్ చేస్తూ నేషనల్ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించడంలో ఈ కొత్త అథారిటీ కీలక పాత్ర పోషిస్తుంది. దేశవ్యాప్తంగా చేపడుతున్న భారీ మౌలిక వసతుల ప్రాజెక్టుల ప్రణాళిక , వాటి అమలును ఇది నిశితంగా పర్యవేక్షించనుంది.

ఇది కూడా చదవండి:  Indiramma Houses Towers | ఏడాదిలోనే పేదల సొంతింటి కల సాకారం: మంత్రి పొంగులేటి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *