Amaravati Projects | ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం.. రూ.1,208 కోట్లతో క్వాంటం వ్యాలీ ట్విన్ టవర్ల నిర్మాణం!

shashi kiran Mottala

అక్షరటుడే, అమరావతి: Amaravati Projects | ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి కీలక అడుగులు వేసింది. ప్రధానంగా రాజధాని పనులు, నిరుద్యోగులకు కొత్త పోస్టులు, రైతుల సంక్షేమంపై దృష్టి సారించిన ప్రభుత్వం సుమారు 20కి పైగా అజెండా అంశాలకు ఆమోదం తెలిపింది.

Amaravati Projects | ట్విన్ టవర్ల కోసం రూ.1,208 కోట్లు

అమరావతిలో ఐకానిక్ భవనాల నిర్మాణానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్వాంటం వ్యాలీ (Quantum Valley) ట్విన్ టవర్ల కోసం రూ.1,208 కోట్లు, సచివాలయం, హెచ్‌ఓడీ టవర్ల బాహ్య అలంకరణ పనుల కోసం రూ.2,540 కోట్లు కేటాయించారు. అలాగే అసెంబ్లీలో సివిల్ పనులకు రూ.798 కోట్లు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1,180 కోట్లను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Amaravati Projects | కొత్త ఉద్యోగాల భర్తీకి..

రాష్ట్రంలో పాలనను మరింత బలోపేతం చేసే దిశగా కొత్త ఉద్యోగాల సృష్టికి ఆమోదం లభించింది. ఎస్పీఎఫ్ (SPF) విభాగంలో 385 మంది కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా ప్రమోట్ చేయాలని నిర్ణయించారు. దీనితో పాటు హైకోర్టు, జిల్లా కోర్టులలో 21 మేనేజర్ పోస్టులు, ఏపీ రూరల్ డెవలప్‌మెంట్ సంస్థలో 20 పోస్టుల భర్తీకి అనుమతినిచ్చారు.

Amaravati Projects | ఏటా కొంత మేర కౌలు పెరిగేలా:

రాజధాని రైతులకు ఊరటనిస్తూ భూముల యాన్యుటీ (కౌలు) పెంపు ప్రతిపాదనకు మంత్రివర్గం అంగీకరించింది. మెట్ట భూములకు ఎకరాకు రూ. 40 వేలు, జరీబు భూములకు రూ. 60 వేల చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా, పదేళ్ల పాటు ఏటా కొంత మేర కౌలు పెరిగేలా నిబంధనలను సవరించారు.

Amaravati Projects | ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్ల ఏర్పాటు

ప్రకాశం జిల్లా (Prakasam District) రామాయపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ పనుల కోసం రూ.354 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అలాగే కృష్ణా నది తీర రక్షణ పనుల కోసం రూ. 443 కోట్లు, నెల్లూరు, కడప వంటి నగరాల్లో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్ల ఏర్పాటుకు స్టాంప్ డ్యూటీ మినహాయింపులు ఇచ్చారు.

Amaravati Projects | ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణం

దేశ రాజధాని ఢిల్లీలో 11.5 ఎకరాల విస్తీర్ణంలో రూ.124.50 కోట్ల అంచనా వ్యయంతో కొత్త ఏపీ భవనాన్ని నిర్మించాలని క్యాబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించి అదనపు పోస్టుల భర్తీకి , పరిపాలనాపరమైన ఇతర ఖర్చులకు కూడా ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.

ఇది కూడా చదవండి..: AP 10th Results | ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *