అక్షరటుడే వెబ్డెస్క్: Modi 25 Years in Politics | భారత రాజకీయ చరిత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త మైలురాయిని అధిగమించారు. గుజరాత్ ( Gujarat ) ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత దేశ ప్రధానమంత్రిగా ఆయన నిరంతరాయంగా 25 ఏళ్ల పాలనా ప్రస్థానాన్ని అక్టోబర్ 7 నాటికి విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ప్రజాప్రభుత్వ అధినేతగా ఏకతాటిపై పాతికేళ్ల పాటు సేవలు అందించిన ఏకైక నేతగా ఆయన ఈ చారిత్రాత్మక రికార్డును సృష్టించారు. ఈ విశేష సందర్భాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని ప్రసిద్ధ శ్రీ వినాయక మందిరాన్ని సందర్శించిన ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Modi 25 Years in Politics 2001 నుంచి నేటి వరకు ..
తొలిసారి 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మోడీ.. ఆ తర్వాత ప్రజల అపార నమ్మకంతో 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ప్రధాని మోడీ పాతికేళ్ల పాలనా కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర మంత్రివర్గం ప్రత్యేక తీర్మానం ద్వారా ఆయనకు ఘనంగా అభినందనలు తెలిపింది. సుపరిపాలన, దేశ సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ఆయన సాగుతున్న తీరు నేటి తరానికి ఆదర్శప్రాయమని మంత్రులు కొనియాడారు.
Modi 25 Years in Politics | ‘వికసిత్ భారత్ 2047’ ఏకైక ధ్యేయం..
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. దేశ ప్రజల ఆశీస్సులు, అచంచలమైన విశ్వాసమే తనను ఇక్కడి వరకు నడిపించాయని పేర్కొన్నారు. ప్రజాసేవతో పాటు ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధనే తన ప్రధాన ఏకైక ధ్యేయం అని స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఇది కూడా చదవండి: Hotel Food Safety | హోటళ్లలో భోజనం చేస్తున్నారా.. రోగాలు కొనితెచ్చుకున్నట్లే..!