Repo Rate Hike | వడ్డీ రేట్లు పెంచిన ఆర్బీఐ.. పెరగనున్న ఈఎంఐల భారం

ఆర్​బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రెపోరేటును 25 బేసిస్​ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Repo Rate Hike | ఆర్​బీఐ (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. రెపోరేటును 25 బేసిస్​ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో రెపో రేటు 5.25 శాతం నుంచి 5.50 శాతానికి చేరింది.

గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో రెపోరేటు పెంచాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, చమురు ధరల పెరుగుదల, రూపాయి బలహీనపడుతున్న నేపథ్యంలో ఆర్బీఐ చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రెపోరేటును పెంచింది.

Repo Rate Hike | 2023 తర్వాత తొలిసారి

రిజర్వ్ బ్యాంక్​ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.5 శాతానికి చేర్చింది. ఫిబ్రవరి 2023 తర్వాత రెపో రేటును పెంచడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. దీంతో బ్యాంకుల నుంచి రుణాలు పొందిన వారిపై అదనపు భారం పడనుంది. బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతాయి. కొత్తగా రుణాలు తీసుకునే వారితో పాటు ఇప్పటికే ఈఎంఐలు కడుతున్న వారు సైతం ఈ భారాన్ని భరించాల్సి ఉంటుంది. ఫ్లోటింగ్​ ఇంట్రె​స్ట్ రేట్​ సెలెక్ట్ చేసుకున్న వారిపై వడ్డీ భారం పడుతుంది. ఫిక్స్​డ్​ వడ్డీ రేట్లతో రుణం పొందిన వారిపై ఎలాంటి భారం ఉండదు. వడ్డీ రేట్ల పెంపుతో నెలానెలా ఈఎంఐ పెరగనుంది. మరోవైపు ఫిక్స్​డ్​ డిపాజిట్లపై సైతం వడ్డీని బ్యాంకులు పెంచే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..: Ashutosh Dixit | ఎయిర్​ఫోర్స్​ కొత్త చీఫ్​గా అశుతోష్ దీక్షిత్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *