Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - బిజినెస్​

బిజినెస్​

ABHFL Berhampur Branch | ఒడిశాలో ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ విస్తరణ.. బ్రహ్మపురంలో నూతన బ్రాంచ్ ప్రారంభం

ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన 'ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్' (ABHFL) తన సర్వీసులను మరింత విస్తరించింది.

Shivam nagarani
Last updated: October 7, 2026, 8:42 pm 8:42 pm
Shivam nagarani
Share
ABHFL Berhampur Branch

అక్షరటుడే వెబ్‌డెస్క్: ABHFL Berhampur Branch | ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన ‘ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్’ (ABHFL) తన సర్వీసులను మరింత విస్తరించింది. దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను పెంచుకునే ప్రణాళికలో భాగంగా ఒడిశాలోని బ్రహ్మపురంలో (Berhampur) నూతన శాఖను ప్రారంభించింది. ఈ కొత్త బ్రాంచ్‌తో కలిపి ఒడిశాలో కంపెనీ మొత్తం బ్రాంచ్‌ల సంఖ్య నాలుగుకు చేరింది.

ABHFL Berhampur Branch |  హౌసింగ్ డిమాండ్..

దక్షిణ ఒడిశాలో  ( Odisha ) కీలకమైన వాణిజ్య , విద్యా కేంద్రంగా ఉన్న బ్రహ్మపురంలో నగర విస్తరణ వేగంగా జరుగుతోంది. ఇక్కడ రిటైల్, సేవలు, వైద్యం, విద్య , చిన్న వ్యాపార రంగాలు అభివృద్ధి చెందుతుండటంతో.. ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు , స్వయం ఉపాధి పొందుతున్న వారిలో స్వంతిల్లు కల సాకారమవుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలకు సులభంగా హౌసింగ్ లోన్స్ అందించేందుకు ఈ కొత్త బ్రాంచ్ ఎంతగానో ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది.

ABHFL Berhampur Branch | వివిధ రకాల లోన్స్..

కస్టమర్ల అవసరాలకు తగినట్లుగా ABHFL అనేక రకాల ఆర్థిక పరిష్కారాలను అందిస్తోంది. అఫోర్డబుల్ హౌసింగ్, ప్రైమ్ హౌసింగ్, కన్‌స్ట్రక్షన్ ఫైనాన్స్ , ప్రాపర్టీపై లోన్‌లు (LAP) అందుబాటులో ఉన్నాయి. జీతం పొందే ఉద్యోగులు, స్వయం ఉపాధి నిపుణులు, వ్యాపారులు , వర్ధమాన ఆదాయ వర్గాల కోసం ఈ రుణాలు ప్రత్యేకంగా రూపొందించనున్నారు. బలమైన డిజిటల్ పద్ధతుల ద్వారా త్వరితగతిన లోన్ అప్రూవల్స్, సులభమైన ఆన్‌బోర్డింగ్ , పూర్తి పారదర్శకతను కల్పిస్తున్నారు.

ABHFL Berhampur Branch | ప్రత్యేక ఆఫర్లు..

ఈ నూతన బ్రాంచ్ ప్రారంభం సందర్భంగా కస్టమర్ల కోసం కంపెనీ ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. అక్టోబర్ 07 నుండి అక్టోబర్ 31, 2026 వరకు ఎలాంటి లాగిన్ ఫీజు (Zero Login Fees) లేకుండా లోన్ దరఖాస్తు చేసుకోవచ్చు . అంతేకాకుండా రూ. 50 లక్షల వరకు స్పాట్ లోన్ శాంక్షన్ల సౌకర్యం కల్పిస్తున్నారు. దీనివల్ల కస్టమర్లకు మరింత త్వరగా రుణాలు లభిస్తాయి.

ఈ విస్తరణ గురించి ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎండీ & సీఈఓ పంకజ్ గాడ్గిల్ మాట్లాడుతూ.. “ఒడిశా మాకు అత్యంత కీలకమైన వృద్ధి మార్కెట్. పెరుగుతున్న డిమాండ్‌కు తగినట్లుగా మా ప్రాంతీయ ఉనికిని చాటుకుంటున్నాము. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి కస్టమర్ల సొంతింటి కలను మరింత సులభంగా, వేగంగా నెరవేర్చడమే మా లక్ష్యం” అని తెలిపారు. ‘హ్యాపీ హోమ్ లోన్ జర్నీ’ అనే నినాదంతో కస్టమర్-సెంట్రిక్ విధానం ద్వారా మరింత మందికి ఆర్థిక సేవలను చేరువ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇది కూడా చదవండి:  Dasara Special Buses | ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. దసరాకు 7 వేల స్పెషల్​ బస్సులు

TAGGED:ABHFLABHFL Berhampur BranchAditya Birla Housing FinanceBerhampur Housing LoansHome Loans OdishaHousing Financelatest newsSpot Loan Sanctiontelugu newsZero Login Fees
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article Sudhakar Ramakrishna CDK Sudhakar Ramakrishna CDK | సీడీకే గ్లోబల్ నూతన అధ్యక్షుడిగా , సీఈఓగా సుధాకర్ రామకృష్ణ నియామకం!
Next Article Fake Property Documents Fake Property Documents | నకిలీ పత్రాలతో ఆస్తులు కాజేస్తున్న ముఠా అరెస్ట్
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

Siddaramaiah Resignation
జాతీయం

Siddaramaiah Resignation | కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా .. గవర్నర్ సెక్రటరీకి లేఖ అందజేత

By Shivam nagarani
TGPSC Notifications
జాబ్స్​ & ఎడ్యుకేషన్​

TGPSC Notifications | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపే 3 కొత్త నోటిఫికేషన్లు

By Shivam nagarani
Rahul Gandhi Supreme Court
జాతీయం

Rahul Gandhi Supreme Court | రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట

By Shivam nagarani
Smart Bazaar Sale
బిజినెస్​

Smart Bazaar Sale | స్మార్ట్ బజార్ లో ‘ఫుల్ పైసా వసూల్ ’.. ఆగస్టు 12-16 వరకు ప్రత్యేక సేల్

By Shashi kiran Mottala
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.