Nana Patekar Death | మనమందరం ఏదో ఒక రోజు వెళ్లాల్సిందే.. మరణం గురించి నానా పటేకర్​

ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ గురువారం గుండెపోటుతో మరణించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nana Patekar Death | ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ గురువారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 4న ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. మరణం గురించి వ్యాఖ్యలు చేశారు. మనందరం ఏదో ఒక రోజు వెళ్లాల్సిందే అన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన నాలుగు రోజుల తర్వాత ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

నానా పటేకర్ ఆదివారం డోనా పౌలాలోని తాజ్ సిడాడ్ డి గోవాలో జరిగిన సమ్రాట్ క్లబ్ ఇంటర్నేషనల్ స్టేట్-1 బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ గురించి నానా పటేకర్​ మాట్లాడారు. పారికర్ వ్యక్తిత్వాన్ని, ఆయన పనితీరును ప్రశంసించారు. అలాగే ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సిందే (మరణించాల్సిందే) అని పేర్కొంటూ, “రేపు నేను ఇక్కడ ఉంటానో లేదో నాకు తెలియదు” అని ఆయన అన్నారు. ప్రతి వ్యక్తి జీవితం చివరికి ఆ దశకు చేరుకుంటుంది. కానీ అది జరగడానికి ముందే, నేను నన్ను నేను ప్రశ్నించుకోవాలి. నేను చేయాలనుకున్న పనిని చేయగలుగుతున్నానా.. అని నానా పటేకర్ అన్నారు. తాజాగా ఆయన మృతి చెందడంతో ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Nana Patekar Death | చివరి చిత్రం..

నానా పటేకర్ చివరిసారిగా షాహిద్ కపూర్, తృప్తి డిమ్రి, అవినాష్ తివారీ దిశా పటానీలతో కలిసి ‘ఓ’రోమియో’ చిత్రంలో నటించారు. 1951లో మహారాష్ట్ర (Maharashtra)లో జన్మించిన ఆయన నటనతో ఎంతో గుర్తింపు ఆదరణ పొందారు. హిందీ, మరాఠీ చిత్రసీమలలో దశాబ్దాల పాటు కొనసాగారు. 1978లో ‘గమన్’ చిత్రంతో హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. సలామ్ బొంబాయి, పరిందా చిత్రాలు ఆయనకు గుర్తింపు తెచ్చాయి.

ఇది కూడా చదవండి..: Nana Patekar Death | భారతీయ సినీ పరిశ్రమలో విషాదం.. నానా పటేకర్ కన్నుమూత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *