Meta Muse AI | ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ‘మ్యూస్’ AI అసిస్టెంట్.. ఇక మీ పనులన్నీ చిటికెలో

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' (Meta) ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుల కోసం మరో శక్తివంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌ను పరిచయం చేసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Meta Muse AI | ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’ (Meta) ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుల కోసం మరో శక్తివంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌ను మరింత ఆసక్తికరంగా, ఉపయోగకరంగా మార్చే లక్ష్యంతో ‘మ్యూస్’ (Muse) పేరుతో సరికొత్త AI అసిస్టెంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. సోషల్ మీడియా వాడకాన్ని కేవలం చాటింగ్‌కే పరిమితం చేయకుండా, మన దైనందిన జీవితంలోని పనులను కూడా ఇది సులభతరం చేయనుంది.

Meta Muse AI | ఎలా పనిచేస్తుంది?

ఇన్‌స్టాగ్రామ్‌లో మనం ఎన్నో రకాల వీడియోలు, రీల్స్ చూస్తుంటాం. ఉదాహరణకు, మీకు నచ్చిన ఏదైనా టేస్టీ వంటకానికి సంబంధించిన రెసిపీ రీల్‌ను ఇతరులకు షేర్ లేదా సెండ్ చేసే సమయంలో ఈ ‘మ్యూస్’ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ రీల్‌ను మీరు ‘మ్యూస్’కి షేర్ చేస్తే చాలు.. ఆ వంటకానికి కావలసిన పదార్థాలన్నింటినీ (Ingredients) క్షణాల్లో విశ్లేషించి, ఒక పూర్తి స్థాయి గ్రాసరీ లిస్ట్‌ను తయారు చేసి ఇస్తుంది.

Meta Muse AI | రోజువారీ పనుల్లో..

కేవలం వంటకాలే కాకుండా, వినియోగదారుల దైనందిన జీవితంలో ఎదురయ్యే పలు పనులను ఈ AI అసిస్టెంట్ అత్యంత సులభతరం చేస్తుంది. ఎక్కడికైనా ట్రిప్ వెళ్లాలనుకుంటే పర్ఫెక్ట్ ట్రావెల్ ప్లానింగ్ రూపొందించడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది. అలాగే ముఖ్యమైన అపాయింట్‌మెంట్‌లను షెడ్యూల్ చేయడం , ప్రొఫెషనల్ ఈమెయిల్స్ రాయడంలోనూ సహకరిస్తుంది. దీనితో పాటు ఆన్‌లైన్ షాపింగ్ , ఇతర అవసరమైన నిత్యకృత్యాల్లోనూ ఇది ఒక మంచి గైడ్‌లా నిలుస్తుంది.

Meta Muse AI | ఎలా వాడుకోవాలి? ..

ఈ ఫీచర్ నేరుగా ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లోనే పూర్తిస్థాయిలో అంతర్గతంగా పనిచేయదు. దీని సేవలను పూర్తిగా పొందాలంటే వినియోగదారులు ప్రత్యేకంగా ‘మ్యూస్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ సరికొత్త AI అసిస్టెంట్ అమెరికా (US) లోని వినియోగదారులకు అందుబాటులోకి రాగా, త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రాంతాల యూజర్లకు కూడా క్రమంగా విస్తరించనున్నట్లు మెటా సంస్థ వెల్లడించింది. సోషల్ మీడియాను కేవలం కాలక్షేపానికే కాకుండా, పనులను ఈజీ చేసుకునేలా మార్చే దిశగా మెటా తీసుకువచ్చిన ఈ ఫీచర్పై టెక్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇది కూడా చదవండి:  Rice Prices Telangana AP | బియ్యం ధరలకు రెక్కలు..? మరీ సామాన్యులకు తిప్పలేనా?

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *