Oct 09 Market Analysis | పాజిటివ్ గా గిఫ్ట్ నిఫ్టీ..మార్కెట్‌లో రిలీఫ్ ర్యాలీకి అవకాశం?

గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్ గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ లాభాలతో ఉండడంతో మన మార్కెట్లలో రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలున్నాయి.

Naresh Chandan
April 27 Pre Market Analysis

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oct 09 Market Analysis | అమెరికా -ఇరాన్ యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్(Trump) వ్యాఖ్యలు, ముడి చమురు ధరల పెరుగుదల, వడ్డీ రేట్ల పెంపుతో ఈక్విటీ మార్కెట్లు ఒత్తిడికి గురవుతున్నాయి. గత సెషన్‌లో గ్లోబల్ మార్కెట్లు ఊచకోతకు గురయ్యాయి.

అయితే అమెరికా బాండ్ ఈల్డ్స్ కాస్త తగ్గడంతో శుక్రవారం మిక్స్‌డ్ గా స్పందిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) మాత్రం పాజిటివ్ గా ఉంది. ఈ నేపథ్యంలో గత సెషన్‌లో భారీ అమ్మకాల ఒత్తిడితో కుదేలయిన దేశీయ స్టాక్ మార్కెట్.. లాభాలతో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Oct 09 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 1.25 శాతం, ఎస్ అండ్ పీ 0.47 శాతం నష్టపోగా.. శుక్రవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.18 శాతం లాభంతో ఉంది.

Oct 09 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 1.20 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.51 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.16 శాతం నష్టపోయాయి.

Oct 09 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.02 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.05 శాతం లాభంతో ఉండగా.. చైనాకు చెందిన షాంఘై 1.23 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.78 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. సౌత్ కొరియా, తైవాన్ మార్కెట్లకు సెలవు. గిఫ్ట్ నిఫ్టీ 0.51 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా పదో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. నికరంగా రూ. 12,943 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

డీఐఐలు వరుసగా 41 వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 10,703 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.

  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 1 పైస బలహీనపడి 96.78 వద్ద ఉంది.
  • క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 103.46 డాలర్ల వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 102.03 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 5.31 శాతం వద్ద ఉంది.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.89 నుంచి 0.73 కి తగ్గింది.
  • విక్స్ 10.01 శాతం పెరిగి 15.27 వద్ద ఉంది.
Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *