Oct 10 Horoscope | గ్రహాల అరుదైన కలయిక.. శని అమావాస్య వేళ జాక్‌పాట్ కొట్టబోయేది ఈ రాశుల వారే!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దిన, వార, సంవత్సర రాశి ఫలాలను పండితులు అందిస్తుంటారు. ఇక్కడ ఇచ్చినవి నేటి రాశి ఫలాలు... రాశుల వారీగా వాటిని తెలుసుకుందాం..

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oct 10 Horoscope | జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇవాళ (శనివారం, అక్టోబరు 10) చంద్రుడు కన్యా రాశిలో సంచరిస్తూ.. హస్తా నక్షత్ర ప్రభావంతో ఉండనున్నాడు. ఇదే సమయంలో ఇంద్ర, హంస, మాళవ్య రాజయోగాలు ఏర్పడటంతో పాటు శని అమావాస్య వేళ గ్రహాల ప్రత్యేక గమనం కొనసాగుతోంది. ఈ శుభ సమయంలో మేషం నుంచి మీన రాశి వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Oct 10 Horoscope | రాశుల వారీగా..

మేష రాశి: Oct 10 Horoscope | ఇవాళ మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చంద్రుడు ఆరో స్థానంలో సంచరించడం , రాశి అధిపతి కుజుడు కర్కాటకంలో ఉండటం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, కాబట్టి ఆర్థిక విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ జీవితంలో వాతావరణం కొన్నిసార్లు అనుకూలంగా లేకపోయినా, ఆధ్యాత్మిక , మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మంచి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇవాళ శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు ఆచరించడం మంచిది.

వృషభ రాశి: Oct 10 Horoscope | ఇవాళ మీకు అనేక విజయాలు, శుభఫలితాలు లభించనున్నాయి. రాజయోగాల ప్రభావంతో ఉద్యోగంలో పదోన్నతులు లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ శుభవార్తలు అందవచ్చు. శని అనుగ్రహం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

మిథున రాశి: Oct 10 Horoscope | మీకు ఇవాళ సానుకూల ఫలితాలు రానున్నాయి. రాశి అధిపతి బుధుడు, శుక్రుడితో కలిసి పంచమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది.

కర్కాటక రాశి: Oct 10 Horoscope | ఈ రాశిలో గురుడు, కుజుల కలయిక , చంద్రుడు సూర్యుడితో కలిసి కన్య రాశిలో సంచరించడం వల్ల ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. కెరీర్ పరంగా గొప్ప పురోగతిని సాధిస్తారు. మతపరమైన , సేవా కార్యక్రమాలలో పాలుపంచుకోవడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి: Oct 10 Horoscope | పెట్టుబడులకు సంబంధించి అత్యుత్తమ అవకాశాలు లభిస్తాయి. శని దేవుని అనుగ్రహం వల్ల గతంలో వేధించిన కష్టాలన్నీ తొలగిపోయి, కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. చేసే ప్రతి పనిలోనూ మెరుగైన ఫలితాలు సాధిస్తారు, అయితే ఆరోగ్యం విషయంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

కన్యారాశి: Oct 10 Horoscope | శని దేవుని కృపతో సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇవాళ చాలా అనుకూలంగా ఉంది, స్నేహితులతో ఆనందంగా సమయం గడుపుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు, అలాగే అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది.

తులా రాశి: Oct 10 Horoscope | ఇవాళ మీకు అన్ని రంగాల్లోనూ శుభ ఫలితాలు ఎదురవుతాయి. పాత వివాదాలన్నీ పరిష్కారమై మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో ఎదురవుతున్న సమస్యలు తొలగిపోయి, ప్రమోషన్ గురించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి: Oct 10 Horoscope | ఇవాళ మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. శని ప్రభావం వల్ల ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నందున ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో చిన్నపాటి మనస్పర్థలు రావచ్చు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సీనియర్ల సలహా తీసుకోవడం మంచిది.

ధనుస్సు రాశి: ఇవాళ మీకు సానుకూల ఫలితాలు లభిస్తాయి. చంద్రుడు దశమ స్థానంలో, గురుడు అష్టమ స్థానంలో సంచరించడం వల్ల కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. అయితే కుటుంబ సభ్యుల ఆరోగ్యం నిమిత్తం కొంత ధనం ఖర్చు చేయాల్సి రావొచ్చు.

మకర రాశి: మీకు ఇవాళ అత్యంత శుభప్రదంగా ఉంటుంది. గురు, కుజుల సంచారం వల్ల సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వైవాహిక , ప్రేమ జీవితంలో మాధుర్యం వెల్లివిరుస్తుంది. ఇవాళ శని మంత్రాలను పఠించాలి.

కుంభ రాశి: శనీశ్వరుని అనుగ్రహంతో ఎన్నో రోజుల సమస్యలకు తెరపడుంది. కుటుంబ సభ్యులతో బంధాలు బలపడతాయి. ఉద్యోగులకు తగిన గుర్తింపు లభించడంతో పాటు ఆదాయం పెరిగేందుకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. నిరుద్యోగులకు శుభవార్త అందే అవకాశం ఉంది.

మీన రాశి: శని తిరోగమనం చెందుతున్న ఈ తరుణంలో ఖర్చులను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. గతంలో చేసిన పెట్టుబడుల వల్ల ఇవాళ మంచి రాబడి, లాభాలు అందుకుంటారు. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పనుల్లో విజయం సాధిస్తారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *