అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Trump Russia Oil Deal | రష్యా చమురు విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) యూ టర్న్ తీసుకున్నారు. ఆ దేశం నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై సుంకాలు విధించిన ట్రంప్ తాజాగా ఆ దేశం నుంచి భారీగా డీజిల్ దిగుమతికి ఒప్పందం చేసుకున్నారు.
రష్యా డీజిల్ కొనుగోలుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అక్టోబర్ 9న, రష్యా తక్షణమే 3 లక్షల టన్నులకు పైగా డీజిల్‌ను సరఫరా చేస్తుందని, రాబోయే నెలల్లో మరిన్ని సరుకులు పంపబడతాయని ట్రంప్ ప్రకటించారు. రష్యా నుంచి భారత్, చైనా ముడి చమురు దిగుమతి చేసుకోవడంపై ఇన్నాళ్లు ట్రంప్ విమర్శలు చేశారు. దిగుమతులతో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి మద్దతు ఇస్తుందని ఆరోపించారు. అంతేగాకుండా భారత వస్తువులపై సుంకాలు విధించారు. భారత్ మాత్రం దేశ ప్రయోజనాల కోసం ఎక్కడ తక్కువకు వస్తే అక్కడ చమురు కొనుగోలు చేస్తామని స్పష్టం చేసింది. అయితే ఇన్ని రోజులు రష్యా చమురుపై ఆంక్షలు విధించిన ట్రంప్.. తాజాగా ఆ దేశం నుంచి డీజిల్ దిగుమతికి ఒప్పందం చేసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Trump Russia Oil Deal | చట్టానికి ఆమోదం
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై సుంకాలు విధించడానికి ఇటీవల అమెరికా ఆమోదం తెలిపింది. లిండ్సే ఓ. గ్రాహం రష్యా– ఇరాన్‌పై ఆంక్షల చట్టం 2026 అక్టోబర్ 2న ఆమోదించింది. రష్యా చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేస్తూనే ఉన్న దేశాలపై 100 శాతం సుంకాలు విధించే అధికారాన్ని ఈ చట్టం కల్పించింది. అమెరికా వినియోగదారులు, రైతులు, ట్రక్కర్ల కోసం ఇంధన ధరలను తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, రష్యా డీజిల్‌ను దిగుమతి చేసుకోవడానికి అధ్యక్షుడు ఇప్పుడు ఒప్పందం చేసుకున్నారు. అమెరికా తన జాతీయ ప్రయోజనాల కోసం రష్యా డీజిల్ కొనుగోలు చేసినప్పుడు, భారత్, ఇతర దేశాలు కొనుగోలు చేస్తే తప్పు ఎలా అవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Trump Russia Oil Deal | ధరలు పెరగడంతో
పశ్చిమాసియాలో యుద్ధంతో అమెరికాలో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు ట్రంప్ రష్యా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా త్వరలో దేశంలో డీజిల్ ధరలు తగ్గుతాయని ప్రకటించారు.
ఇది కూడా చదవండి..: Navi Pillay Nobel Peace Prize | ట్రంప్‌నకు మళ్లీ నిరాశే.. నవీ పిళ్లైకి నోబెల్ శాంతి బహుమతి