Dasara Special Buses | బస్టాండ్​లలో దసరా రద్దీ.. స్పెషల్​ బస్సుల్లో అధిక ఛార్జీలు

దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్​ నుంచి ప్రజలు స్వగ్రామాలకు పయనం అవుతున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Dasara Special Buses | పాఠశాలలు, కాలేజీలకు దసరా సెలవులు ప్రారంభం అయ్యాయి. దీంతో హైదరాబాద్​ (Hyderabad) నగరంలో చదువుకునే విద్యార్థులు, ప్రజలకు పండుగ కోసం ఇళ్లకు పయనం అవుతున్నారు. ప్రయాణికులు స్వగ్రామాలకు వెళ్తుండటంతో నగరంలోని ఎంజీబీఎస్​, జేబీఎస్​ బస్టాండ్లలో భారీగా రద్దీ ఉంది.

Dasara Special Buses | రైల్వే స్టేషన్​లలో సైతం

బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆర్టీసీ దసరా రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడుపుతోంది. స్పెషల్​ బస్సుల్లో 50శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. మరోవైపు సికింద్రాబాద్‌, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లలో భారీ రద్దీ ఉంది. ఏపీ, తెలంగాణ రూట్లలో పెరిగిన ప్రయాణికుల రద్దీ పెరిగింది.

ఇది కూడా చదవండి..: Telangana Deputy Collectors | తెలంగాణలో డిప్యూటీ కలెక్టర్ల బదిలీ..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *