Paddy Farmers | ఎండుతున్న పంటలు.. ఆందోళనలో అన్నదాతలు

రాష్ట్రంలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Paddy Farmers | రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. వేసవిని తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి.

ఈ ఏడాది ఎల్​నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడ్డాయి. చెరువులు, జలాశయాల్లోకి పూర్తిస్థాయిలో నీరు చేరలేదు. భూగర్భ జలాలు సైతం పెరగలేదు. అయితే వర్షాలు పడుతాయనే ఆశతో రైతులు వరి, ఇతర పంటలు సాగు చేశారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వరి కోతలు ప్రారంభం అయ్యాయి. మరికొన్ని చోట్ల పంట చేతికొచ్చే దశలో ఉంది. ఈ క్రమంలో పొలాలకు నీరు అందడం లేదు. దీంతో వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన పంట చేతికొచ్చే సమయంలో ఎండిపోతుందని రైతులు (Farmers) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Paddy Farmers | కరెంట్ కష్టాలు

ప్రస్తుత సీజన్​లో భూగర్భజలాలు మరింత లోతులోకి పడిపోయాయి. దీంతో బోర్లు పోయడం లేదు. మరోవైపు వ్యవసాయానికి 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారు. దీంతో బోర్లు పోసే రైతుల పొలాలు సైతం కరెంట్ లేక పారడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు. కాగా రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో ప్రస్తుతం నీటిమట్టం అంతంతమాత్రంగానే ఉంది. దీంతో రానున్న రోజుల్లో తాగునీటికి సైతం కష్టాలు ఏర్పడే అవకాశం ఉంది.

Paddy Farmers | యాసంగిలో కష్టమే..

ప్రస్తుతం వానాకాలం సీజన్​లో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో యాసంగిలో పంటలు వేసే రైతులు జాగ్రత్తలు పాటించాలి. ఆరుతడి పంటలు వేసుకోవాలి. కాలువలు, చెరువుల కింద ఆయకట్టుకు నీరు అందించే అవకాశం ఉండదు. మరోవైపు భూగర్భ జలాలు మరింత లోతుకు పడిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడే కరెంట్ కోతలతో పొలాలు పారడం లేదు. అయితే యాసంగిలో కరెంట్ కష్టాలు మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు రైతులు ఇప్పటి నుంచే ప్రణాళికతో యాసంగి పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవసాయ అధికారులు సైతం ఈ మేరకు అన్నదాతలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

ఇది కూడా చదవండి..: Dasara Special Buses | బస్టాండ్​లలో దసరా రద్దీ.. స్పెషల్​ బస్సుల్లో అధిక ఛార్జీలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *