అక్షరటుడే, నిజామాబాద్క్రైం: Illegal Liquor Seizure | నగరం (Nizamabad)లో అక్రమంగా నిల్వ ఉంచిన విదేశీ, డిఫెన్స్ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అరుణ్‌కుమార్ వివరాలు వెల్లడించారు.
Illegal Liquor Seizure | న్యాల్కల్, ముబారక్‌నగర్‌లో..
నగరంలోని న్యాల్కల్, ముబాకర్నగర్లో ఇద్దరు వ్యక్తుల వద్ద విదేశీ, డిఫెన్స్ మద్యం అక్రమంగా నిలువ ఉన్నట్లు అందిన సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈక్రమంలో మూడ భాస్కర్, కంఠాల గంగారత్నం ఇళ్లలో 110బాటిళ్ల మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బాటిళ్లను వారు విదేశాల నుండి వచ్చిన వారి నుండి కొనుగోలు చేశారని.. అలాగే ఇతర మార్గాల ద్వారా డిఫెన్స్ మద్యం తక్కువ ధరకు కొనుగోలు చేశారన్నారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్‌హెచ్‌వో సరిత, సిబ్బంది నజీర్ హుస్సేన్, గజేందర్, వి. రవి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Jukkal Bathukamma Celebrations | జుక్కల్‌లో బతుకమ్మ సంబరాలు.. విజేతలకు బహుమతులు