lashkar commander imran | పాకిస్థాన్‌లో మరో ఉగ్రవాది హతం?.. వైరల్ అవుతున్న భీకర వీడియో!

ఈ ఫుటేజీ ఆధారంగా బాధితుడి అసలు గుర్తింపు ఏంటి? అతనికి నిజంగానే ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయా? లేదా ఈ హత్య వెనుక అసలు ఉద్దేశం ఏంటి?

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: lashkar commander imran | పాకిస్థాన్‌ గడ్డపై మరోసారి కాల్పుల మోత కలకలం సృష్టించింది. పగటిపూటే రోడ్డుపై ఒక బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని అతి కిరాతకంగా కాల్చి చంపిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మృతుడు లష్కరే తోయిబాకు చెందిన టాప్ కమాండర్ ఇమ్రాన్ అని, పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐతోనూ అతనికి సంబంధాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.

lashkar commander imran | పంజాబ్​ ప్రావిన్స్​లో..

పాకిస్థాన్‌లోని పంజాబ్ Punjab ప్రావిన్స్‌లో జరిగినట్లుగా చెబుతున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అక్టోబర్ 13, 2026 నాడు మధ్యాహ్నం 11:54 గంటల టైమ్‌స్టాంప్‌తో ఈ క్లిప్ వైరల్ అవుతోంది.

గేటు నుంచి బైక్‌పై బయటికి వస్తున్న ఒక వ్యక్తిని, తెల్లటి దుస్తులు ధరించిన మరో వ్యక్తి అటకాయించి ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ప్రాణభయంతో బైక్‌ను తిప్పబోయిన ఆ వ్యక్తి కిందపడిపోవడంతో.. నిందితుడు మరింత సమీపానికి వెళ్లి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

nandan Nilekani AI exams | పేపర్ లీకేజీలకు చెక్ పెట్టేలా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో పరీక్ష రోజునే ప్రశ్నపత్రం! : నందన్ నీలేకని కీలక ప్రకటన

అంతేకాదు.. తన బ్యాగులో ఉన్న మరో గన్‌ను తీసి మళ్లీ కాల్పులు జరిపిన ఆ దుండగుడు, ఆ తర్వాత విజయగర్వంతో చేతులు పైకెత్తి సంబరాలు చేసుకున్నట్లుగా ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తర్వాత రెండు తుపాకులతో అక్కడి నుంచి పరారయ్యాడు.

lashkar commander imran | లష్కరే తోయిబా ఇమ్రాన్?

ఈ వీడియోను షేర్ చేస్తున్న అనేక సోషల్ మీడియా ఖాతాలు.. హతమైన వ్యక్తి లష్కరే తోయిబా సీనియర్ ఆపరేటివ్ ఇమ్రాన్ అని, అతనికి పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ISI)తో లింక్స్ ఉన్నాయని తెగ ప్రచారం చేస్తున్నాయి. అయితే, ఈ వాదనలను బలపరిచే అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

ఈ ఫుటేజీ ఆధారంగా బాధితుడి అసలు గుర్తింపు ఏంటి? అతనికి నిజంగానే ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయా? లేదా ఈ హత్య వెనుక అసలు ఉద్దేశం ఏంటి? అనే అంశాలపై ఇప్పటివరకు ఎలాంటి స్వతంత్ర ధృవీకరణ రాలేదు. వీడియో రికార్డయిన కచ్చితమైన ప్రదేశం కూడా ఇంకా నిర్ధారణ కాలేదు.

lashkar commander imran | అధికారికంగా నిర్ధారిస్తారా..?

ఈ ఘటనపై పాకిస్థాన్ పోలీసులు గానీ, పంజాబ్ ప్రావిన్షియల్ అధికారులు గానీ, ఆర్మీ వర్గాలు గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ హత్యకు సంబంధించి ఎలాంటి దర్యాప్తు వివరాలు, అరెస్టుల సమాచారం కూడా వెలుగులోకి రాలేదు.

అధికారిక వర్గాల నుంచి స్పష్టత వచ్చే వరకు లష్కరే కమాండర్ ఇమ్రాన్ హతమయ్యాడనే వార్త కేవలం ఊహాగానాలకే పరిమితమైంది. ఈ సంచలన ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *