అక్షరటుడే, వెబ్‌డెస్క్: PoK Protests | పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఆందోళనల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఆ ప్రాంతంలో ఆర్థిక దిగ్బంధనాన్ని విధించిందని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) నాయకుడు సర్దార్ అమన్ ఖాన్ ఆరోపించారు.
పీవోకేలో కొనసాగుతున్న ఆందోళనను పాక్ ప్రభుత్వం (Pakistan Government) అణచివేస్తోంది. ఈ క్రమంలో అనేక మంది నిరసనకారులు మరణించారు. దీంతో జేఏఏసీ నాయకులు భారత్ సాయం కోరారు. మానవతా సహాయం పంపాలని, ఎల్వోసీ వెంబడి సరిహద్దును తెరవాలని సర్దార్ అమన్ ఖాన్ కోరారు. నిరసనకారులపై భద్రతా దళాలు ఆపరేషన్లను ముమ్మరం చేయడంతో, పీవోకే ప్రజలు ఆహారం, మందుల కొరతను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
PoK Protests | మాకు స్వేచ్ఛ కావాలి
ఈద్గా మైదానంలో జరిగిన ఒక భారీ నిరసన ర్యాలీలో ప్రజలు పీఓకే పాకిస్తాన్‌లో భాగం కాదన్నారు. “మాకు స్వేచ్ఛ కావాలి” అని నినాదాలు చేశారు. జేఏఏసీని నిషేధించి, ఆక్రమిత భూభాగంలో ప్రాణాంతక బలప్రయోగం చేయాలన్న పాకిస్తానీ అధికారుల నిర్ణయం, ఆ ప్రాంతంలో పెరుగుతున్న అశాంతిని అణచివేయడానికి అనుసరిస్తున్న ఒక విస్తృత సైనిక ప్రేరిత వ్యూహాన్ని ప్రతిబింబిస్తుంది.
PoK Protests | జులై 9న ఫైనల్ యాక్షన్
పాక్ ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే.. జులై 9న ఫైనల్ యాక్షన్‌ను ప్రారంభిస్తామని జేఏఏసీ నేతలు తెలిపారు. ఆ రోజు నిరసనల్లో భాగం కావాలని ప్రజలు, ప్రవాస కశ్మీరీలను కోరింది. అప్పటివరకు క్షమశిక్షణతో వ్యవహరించాలని కోరింది. పాక్ అణచివేతలు, పౌర హత్యలను అంతర్జాతీయ సమాజం గమనించాలని అభ్యర్థించింది. నిర్బంధంలో ఉన్న తమ నాయకులను విడిచిపెట్టడంతో పాటు 38 పాయింట్ల ఒప్పందాన్ని అమలు చేయాలని జేఏఏసీ డిమాండ్ చేస్తోంది.
ఇది కూడా చదవండి..: Ali Khamenei Funeral 2 | టెహ్రాన్‌లో అలీ ఖామెనీ అంత్యక్రియలు.. ట్రంప్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు