Tukkuguda Demolitions | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. భారీగా ట్రాఫిక్​ జామ్

తుక్కుగూడలో అక్రమ నిర్మాణలను జీహెచ్​ఎంసీ అధికారులు కూల్చివేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tukkuguda Demolitions | రంగారెడ్డి జిల్లా (Rangareddy District) తుక్కుగూడలో అక్రమ నిర్మాణలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. జీహెచ్​ఎంసీ అధికారులు బుధవారం ప్రత్యేక డ్రైవ్​ చేపట్టి నిర్మాణాలను కూల్చివేశారు.

శ్రీశైలం రహదారికి ఇరువైపులా తుక్కుగూడలో భారీగా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ఆయా నిర్మాణాల్లో పలు దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఫిర్యాదులు రావడంతో జీహెచ్​ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం నుంచి జేసీబీల సాయంతో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రారంభించారు.

Tukkuguda Demolitions | తీవ్ర ఉద్రిక్తత

జీహెచ్​ఎంసీ అధికారులను స్థానికులు అడ్డుకోడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడకు వచ్చారు. పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను తొలగించారు. కూల్చివేతలు, నిరసనల కారణంగా శ్రీశైలం జాతీయ రహదారిపై ట్రాఫిక్​ జామ్ అయింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇది కూడా చదవండి..: T20 Ticket Black Marketing | హైదరాబాద్‌లో టీ20 టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ గుట్టురట్టు.. నలుగురి అరెస్టు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *