అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jio IPO | రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్, టెలికాం విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (జేపీఎల్) ఐపీవోపై స్పష్టత వచ్చింది. ఈ కంపెనీ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 30,213 కోట్లు సమీకరించనుంది. రూ. 10 ముఖ విలువ కలిగిన 27 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించనున్నారు.
ఇది పూర్తిగా ఫ్రెష్ ఇష్యూ. కంపెనీ రిజర్వ్ చేసింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను జియో ఇన్ఫోకామ్ రుణాల తిరిగి చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నారు. రిలయన్స్ జియో బుధవారం రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు దాఖలు చేసిన రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ లో ఈ వివరాలున్నాయి.
Jio IPO | దేశంలోనే అతిపెద్ద ఐపీవో..
దేశంలోనే అతిపెద్ద ఐపీవో ( IPO)గా జియో ప్లాట్‌ఫామ్స్ రికార్డు సృష్టించబోతోంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 30,213 కోట్లు సమీకరించి ఈ ఘనత సాధించనుంది. ఇంతకుముందు ఈ రికార్డు హ్యుందాయ్ మోటార్స్ పేరిట ఉంది. ఆ కంపెనీ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 27,800 కోట్లు సమీకరించింది.
Jio IPO | ధరల శ్రేణి..
కంపెనీ ధరల శ్రేణిని రూ. 1,065 నుంచి రూ.1,119గా నిర్ణయించింది. ఒక లాట్ లో 12 షేర్లుంటాయి. రిటైల్ ఇన్వెస్టర్లు గరిష్ఠ ధర ప్రకారం ఒక లాట్‌కు రూ.13,428 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
కోటా : క్యూఐబీలకు 50 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, ఎన్ ఐఐలకు 15 శాతం కోటా కేటాయించారు.
జీఎంపీ : కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్లో స్వల్ప జీఎంపీ ఉంది. ఒక్కో షేరుకు రూ. 202 ప్రీమియం లభిస్తోంది. అంటే ఐపీవో అలాట్ అయినవారికి లిస్టింగ్ సమయంలో 18 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.
Jio IPO | ఉద్యోగులు, రిలయన్స్ వాటాదారులకూ వాటా..
జియో ఐపీవోలో రిలయన్స్ ఉద్యోగులు, వాటాదారులకు కొన్ని షేర్లను రిజర్వ్ చేశారు. రూ.500 కోట్ల విలువైన షేర్లను ఉద్యోగులకు, రూ.2,500 కోట్ల విలువైన షేర్లను రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారులకు కేటాయించారు. రిలయన్స్ ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.54 డిస్కౌంట్ ఇచ్చారు. అక్టోబరు 14 నాటికి రిలయన్స్ షేర్లు కలిగి ఉన్నవారు షేర్ ీVAల్డర్ల కోటాలో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఐపీవో తేదీలు : అక్టోబర్ 21న సబ్స్క్రిప్షన్ ప్రారంభమవుతుంది. 23న ముగుస్తుంది. షేర్ల అలాట్మెంట్ స్టేటస్ 26న అర్ధరాత్రి దాటాక వెల్లడయ్యే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు 28న స్టాక్ మార్కెట్లో లిస్టవుతాయి. కాగా యాంకర్ ఇన్వెస్టర్ల కోసం బిడ్డింగ్ విండో అక్టోబర్ 19న తెరుచుకుంటుంది.
ఇది కూడా చదవండి..: Oct 15 Gold Prices | బంగారం ధరల్లో భారీ తగ్గుదల.. వెండి 4.1 శాతం పతనం!