అంతర్జాతీయంAttack on Trump | ట్రంప్‌పై దాడికి యత్నం.. షాకింగ్ వీడియో విడుదల, బయటపడిన నిందితుడి...

Attack on Trump | ట్రంప్‌పై దాడికి యత్నం.. షాకింగ్ వీడియో విడుదల, బయటపడిన నిందితుడి ప్లాన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడి యత్నానికి సంబంధించిన వీడియోను న్యాయ శాఖ విడుదల చేసింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Attack on Trump | అమెరికాలో మరోసారి భద్రతా వ్యవస్థలపై ప్రశ్నలు లేవనెత్తే ఘటన వెలుగులోకి వచ్చింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump)పై జరిగిన దాడి యత్నానికి సంబంధించిన కీలక వీడియోను అమెరికా న్యాయ శాఖ తాజాగా విడుదల చేసింది.

ఈ ఘటన గత వారం వాషింగ్టన్ హిల్‌టన్ హోటల్లో (Washington Hilton Hotel) చోటుచేసుకుంది.సుమారు ఆరు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో 31 ఏళ్ల నిందితుడు కోల్ అలెన్ చేసిన ప్రతి కదలిక స్పష్టంగా కనిపిస్తోంది. భద్రతా వలయాన్ని ఛేదించి పారిపోవడానికి ప్రయత్నించిన అతను, తనను అడ్డుకోవడానికి వచ్చిన సీక్రెట్ సర్వీస్ అధికారిపై కాల్పులు జరిపిన దృశ్యాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

Attack on Trump | సీసీ కెమెరాల‌లో రికార్డ్ అయిన దృశ్యాలు..

దాడికి ముందు రోజు నుంచే కోల్ అలెన్ హోటల్ (Cole Allen Hotel) పరిసరాల్లో రెక్కీ నిర్వహించినట్లు ఈ వీడియోలో బయటపడింది. ముఖ్యంగా వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సమయంలో ట్రంప్‌ను టార్గెట్ చేయాలని అతను పథకం వేసుకున్నట్లు అధికారులు తెలిపారు. హోటల్ కారిడార్లు, ఫిట్‌నెస్ సెంటర్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ సరైన సమయం కోసం వేచి చూసిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇక ఈ ఘటనలో మరో కీలక అంశం కూడా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అడ్డుకునేందుకు ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ తన ఆయుధంతో మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

Attack on Trump | సోషల్ మీడియాలో వీడియో వైరల్‌

అయితే ఆ కాల్పుల్లో నిందితుడికి ఎలాంటి గాయాలు కాలేదని, అతను తృటిలో తప్పించుకున్నాడని అధికారులు వెల్లడించారు.ఈ ఉత్కంఠభరిత దృశ్యాలను న్యాయ శాఖ స్లో-మోషన్ ఫుటేజ్ రూపంలో కూడా విడుదల చేయడంతో సోషల్ మీడియా (Social Media)లో వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనతో అమెరికాలో ప్రముఖుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Iran Gulf Tensions | పర్షియన్ గల్ఫ్‌లో ‘ఇరాన్’ కొత్త నిబంధనలు.. అమెరికాకు ఇక నో ఎంట్రీ!

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

conductor attacks officer | లంచం అడిగిన అధికారి.. చెప్పుతో కొట్టిన కండక్టర్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : conductor attacks officer | రాష్ట్రంలో అవినీతి...

KTR on Gas Prices | మోదీపై కేటీఆర్​ ఫైర్​.. గ్యాస్​ ధరలు తగ్గించాలని డిమాండ్​

అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR on Gas Prices | ప్రధాన మంత్రి...

High Court Notices | పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం.. సీవీ ఆనంద్‌కు ధిక్కార నోటీసులు!

అక్షరటుడే, హైదరాబాద్: High Court Notices | పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్...

Chandrababu Pension Scheme | ఏడాదికి రూ. 33 వేల కోట్ల పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే :సీఎం చంద్రబాబు

అక్షరటుడే, కృష్ణా జిల్లా: Chandrababu Pension Scheme | ఆంధ్రప్రదేశ్ (Andhra...