Mumbai Cocaine Seizure | ముంబైలో ఎన్సీబీ సంచలనం.. రూ.1,745 కోట్ల కొకైన్ సీజ్!

Srinivas Kolluri

అక్షరటుడే, న్యూఢిల్లీ: Mumbai Cocaine Seizure | దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (Narcotics Control Bureau) అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఒక అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్‌ను ఛేదించిన అధికారులు, సుమారు రూ.1,745 కోట్ల విలువైన 349 కిలోల అత్యంత నాణ్యమైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) శుక్రవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Mumbai Cocaine Seizure | ఆపరేషన్ విశేషాలు:

ఈ ఆపరేషన్‌లో అధికారులు ఒక చిన్న క్లూ ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టి, చివరకు అతిపెద్ద అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను వెలికితీశారు. దీన్ని అమిత్ షా ‘అద్భుత విజయం’గా అభివర్ణించారు. దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, మాదకద్రవ్యాల ముఠాలను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తామని హోం మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో ముంబైలో పట్టుబడిన అతిపెద్ద డ్రగ్స్ సరుకులలో ఇది ఒకటిగా నిలిచింది.

Mumbai Cocaine Seizure | లోతైన దర్యాప్తు:

అంతర్జాతీయ స్మగ్లర్ మరియు దావూద్ ఇబ్రహీం అనుచరుడు సలీం డోలాను టర్కీ నుంచి భారత్‌కు తీసుకువచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ భారీ ఆపరేషన్ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. పట్టుబడిన డ్రగ్స్ నెట్‌వర్క్‌కు అంతర్జాతీయ ముఠాలతో ఉన్న సంబంధాలపై అధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Air India Services Cut | ఎయిరిండియా కీలక నిర్ణయం.. పలు మార్గాల్లో సర్వీసుల తగ్గింపు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *